
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులను అక్రమ వలసదారులుగా ముద్రవేసి తిరిగి పంపిన దారుణానికి సంబంధించిన వీడియోని వైట్ హౌస్ విడుదల చేసింది. విమానం ఎక్కే ముందు వలసదారులకు సంకెళ్లు వేయడాన్ని వీడియోలో చూడవచ్చు. 41 సెకన్ల వీడియోను ఎక్స్ సిఈఓ ఎలెన్ మస్క్ తన ఖాతాలో షేర్ చేస్తూ.. ‘హహా వావ్’ అనే వ్యాఖ్య చేశారు.
చేతులు, కాళ్ళు కట్టి వలసదారులను బందీలుగా ఉన్నట్లుగా, కఠినంగా తనిఖీ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. మానవ హక్కులను పూర్తిగా ఉల్లంఘించే షాకింగ్ దృశ్యాలు బయటకు వచ్చాయి. ట్రంప్ వలసదారులను బహిష్కరించే విధానానికి వ్యతిరేకంగా అనేకచోట్ల నిరసనల జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేశారు.
అదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం 300 మందికి పైగా వలసదారులను పనామాలోకి అక్రమంగా తరలించింది. వారి మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్ట్‌లు జప్తు చేశారు. భారతీయులతో సహా పలు దేశాల అక్రమ వలసదారులను పనామా ఒక హోటల్ లో ఉంచింది. యూఎస్ ఆదేశాల మేరకు పనామా ప్రభుత్వం వారికి అక్కడ బస ఏర్పాటు చేసింది.
వలసదారులలో ఇరాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గాన్, చైనా ఇతర దేశాల వలసదారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా దేశాల అధికారులు వారిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేసే వరకు హోటల్‌లోనే ఉంటారని ఈ మేరకు పనామా వెల్లడించింది. పట్టుబడిన వారిలో 40 శాతం మంది సొంతంగా తమ దేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా లేరని పనామా అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ వారిని వారి వారి దేశాలకు పంపిస్తామని అధికారలు వెల్లడించారు.
నివేదికల ప్రకారం, పనామాను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ఒత్తిడి వ్యూహంలో భాగంగా వలసదారులను పనామాలోకి అక్రమంగా తరలించారు. భారతదేశంతో సహా ఆసియా దేశాల నుండి వలస వచ్చిన వారిని అమెరికా బహిష్కరిస్తున్నందున, తాత్కాలిక ఆశ్రయాన్ని సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోస్టారికా మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటి వరకు యుద్ద విమానాలలో ఆయా దేశాలకు తరలించిన ట్రంప్ ఇప్పడు తన సమీప దేశాలకు ఆ బాధ్యతను అప్పగించేశారు. దేశంలో దొరికినవారికి దొరికినట్లు పక్కదేశాలకు ట్రాన్స్ పోర్ట్ చేయడం ప్రారంభించేశారు..అలాగే ఇటు కోస్టారికాతోనూ, పనామా దేశంతో అమెరికా ఈ వలస రవాణపై ఒప్పందాలు కుదుర్చకున్నాయి. దీనిలో భాగంగా 200 మంది భారత అక్రమ వలసదారులతో కూడిన తొలి విమానం కోస్టారికాకు బుధవారం చేరింది. అయితే 200 మందిలో భారతీయులు ఎందరన్నది మాత్రం వెల్లడించలేదు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?