
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర ఉక్క శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కొన్ని కారణాల వల్ల నష్టాల్లో ఉందని చెప్పారు. అయితే, దేశంలో అత్యున్నతమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఆయన అభివర్ణించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు ఆర్థిక ప్యాకేజీని కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్దికి కేంద్రం సహకరిస్తుందని వర్మ హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌ని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని శ్రీనివాస వర్మ వివరించారు.ఈ సంస్థ ప్రైవేటీకరణ జరగదని ఆయన స్టీల్ ప్లాంట్ సిబ్బందికి కూడా భరోసా ఇచ్చారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ