బెంగుళూరులో అద్భుతంగా ప్రారంభమైన ఎయిర్ షో

బెంగుళూరులో అద్భుతంగా ప్రారంభమైన ఎయిర్ షో
 
ప్రపంచదేశాలు పాల్గొంటున్న ప్రతిష్టాత్మక ఏరో ఇండియా-2025  ఎయిర్‌ షో సిలికాన్‌ సిటీ బెంగళూరులో  అట్టహాసంగా ప్రారంభం అయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం యలహంకలోని వైమానిక దళ స్టేషన్‌లో ఈ షోను ప్రారంభిస్తూ  భారత రక్షణ రంగం నవీన సాంకేతిక ఆవిష్కరణలతో పాటు దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుందని, ఆత్మ నిర్భరత, స్వయం సంవృద్ధి, స్వావలంబనకు సంకేతంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
 
భారత రక్షణ రంగం ఉత్పాదనపరంగా రూ.1.27 లక్షల కోట్లు, ఎగుమతుల్లో రూ.21 వేల కోట్లు దాటిందని వెల్లడించారు. ‘ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా నిలిచే ఈ షోకు ఈ దఫా ‘రన్‌ వే ఫర్‌ బిలియన్‌ అపార్చునిటీస్‌’ అన్న ఇతివృత్తాన్ని ఎంచుకున్నాం. 90 దేశాల నుంచి 150 కంపెనీలు పాల్గొంటున్నాయి. 900కు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి’ అని చెప్పారు.
 
అమెరికా, రష్యా తదితర దేశాల యుద్ధవిమానాల విన్యాసాలుంటాయి. 30 దేశాల రక్షణ మంత్రులు, ప్రతినిధులు హాజరవుతున్నారు. భారత్‌ పెవిలియన్‌లో ప్రదర్శించే రక్షణ రంగ ఉత్పత్తులు దేశీయ తయారీ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ, సాంకేతిక, సృజనాత్మక ఆలోచనలను రేకెత్తిస్తాయి. 14, 15 తేదీల్లో సందర్శకులు వీక్షించవచ్చని రక్షణ మంత్రి వివరించారు.హెచ్‌ఏఎల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీ యూనిట్‌ను రాజ్‌నాథ్‌ సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) ఎంకే1ఏ సామర్థ్యాన్ని పరీక్షించారు. మరోపక్క, ఈ ప్రదర్శన కోసం వచ్చిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్, చీఫ్‌ ఆఫ్‌ ది ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీలు ఎల్‌సీఏ తేజస్‌పై విహరించారు.

కాగా, ఐదు రోజులపాటు జరగనున్న ఈ షో కోసం ఏర్పాట్లన్నీ గ్రాండ్‌గా చేశారు. మొత్తం 42,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా 900 మంది ఎగ్జిబిటర్లు ఈ షోలో పాల్గొననున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అప్డేటెడ్ టెక్నాలజీతో రష్యా ప్రదర్శనఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఎయిర్‌ షో మొదలైంది.

భారత్ తో పాటు ప్రపంచదేశాల యుద్ధవిమానాలు గగనతలంలో సందడి చేస్తున్నాయి. రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మక జరిగే ఈ షోకి వేదికైంది బెంగళూరులోని యలహంక. జనవరి 10 నుంచి 14వరకు జరగనుందీ ఎయిర్‌ షో. ప్రపంచ దేశాల యుద్దవిమానాలు షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా, రష్యా, అమెరికాపైనే ఉంది.

 అయితే ఈసారి అప్‌డేటెడ్‌ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా ఉవ్విళ్లూరుతోంది. రష్యా రూపొందించిన ఎస్‌యూ-57, అలాగే అమెరికాకు చెందిన ఎఫ్‌-35 లైట్నింగ్‌ 2 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర రక్షణశాఖ ఈ ఎయిర్‌ షోని 1996 నుంచి రెండు సంవత్సరాలకోసారి నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 14సార్లు ఎయిర్‌ షోలు జరగ్గా, ఇది 15వ ఎయిర్‌షో. అలాగే ప్రతీసారి బెంగళూరే ఎయిర్‌షోకి అతిథ్యమిస్తూ వస్తోంది. ఎయిర్‌ షో చూసేందుకు పలురాష్ట్రాల నుంచి బెంగళూరు వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.