
కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఉదయం అర్చకుడు రంగరాజన్‌ను కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ కుటుంబం సేవ చేస్తుందని గుర్తు చేసుకున్నారు. రంగరాజన్ పై దాడి పూర్తిగా ప్రభుత్వ విమర్శించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయని చెబుతూ వీడియో అందుబాటులో ఉన్నప్పటికీ రెండు రోజులపాటు హోమ్ మంత్రి, ముఖ్యమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా. ఏ జెండా పట్టుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి.
రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ వద్ద భద్రతను ఏర్పాటు చేయాలని పేర్కొంటూ రంగరాజన్‌ను అవమానించడం అంటే దేవుని అవమానించడమే అని స్పష్టం చేశారు. రంగరాజన్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మరోవైపు రంగరాజన్‌పై దాడి ఘటనలో పోలీసులు 17 మంది ఆచూకీని గుర్తించారు పోలీసులు. మొత్తం దాడి చేసిన వ్యక్తులు 22 మంది కాగా, వారిలో 17 మందిని పోలీసులు కనుగొన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిమందిని గుర్తించారు. ఈ ఘటనలో వీర రాఘవ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే వీర రాఘవరెడ్డి అనుచరులు ఐదు మందిని ఈరోజు మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.\
ఈ నెల 7న వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి రంగరాజన్ నివాసానికి చేరుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రాంగణంలోనే రంగరాజన్ నివాసం ఉంటుంది. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అలాగే దేవాలయాన్ని తమకు అప్పగించాలని రంగరాజన్‌పై తీవ్ర ఒత్తడి తీసుకొచ్చారు. దీన్ని వ్యతిరేకించిన రంగరాజన్‌పై వీరరాఘవరెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారు. దీనిపై రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 22 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైన వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు