
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రదాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా కూడా వచ్చారు. పార్టీ కార్యకర్తలు జెండాలు ఊపుతూ, నినాదాలు హోరెత్తింది. అప్పటికే అక్కడకు చేరుకున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులకు మోదీ అభినందనలు తెలిపారు. పదేళ్ల కష్టాలు, సమస్యలనుంచి ఢిల్లీకి విముక్తి అభించిందని తెలిపారు. కాగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ డిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని చెప్పారు. ఆప్ నుంచి విముక్తి పొందిన ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారని, బీజేపీ కార్యకర్తల్లోనూ ఉత్సాహం పెరిగిందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి “యమునా మాయి కీ జై” అనే నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆప్‌దా ప్రభుత్వం నుంచి విముక్తులై బీజేపీ పాలనా శకం ప్రారంభం కానుండటంతో ఢిల్లీ ప్రజలు ఎంతో ఉపశమనంతో, ఉల్లాసంగా ఉన్నారని తెలిపారు. ”21వ శతాబ్దంలో సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ఢిల్లీ వాసులందరికీ లేఖ రాశాను. ఈరోజు ఢిల్లీ ప్రజలంతా నాపై విశ్వాసం ఉంచినందుకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. ప్రజలంతా ఎంతో ప్రేమతో ఆశీర్వదించారు. ఇందుకు ప్రతిగా ఢిల్లీ శ్రీఘ్ర అభివృద్ధికి పాటుపడతానిని హామీ ఇస్తున్నాను” అని మోదీ చెప్పారు.
ఆమ్‌ఆద్మీ పార్టీ షార్ట్‌కట్ రాజకీయాలకు డిల్లీ ఓటర్లు షార్ట్ సర్య్కూట్ ఇచ్చారని ప్రధాని ఎద్దేవా చేశారు. “డి విజయం సామాన్య విషయం కాదు. వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చింనందుకు దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. దిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు పెంచి తిరిగిస్తాం. పదేళ్ల కష్టాలు, సమస్యల నుంచి డిల్లీకి విముక్తి లభించింది” అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
“మెట్రో పనులు ముందుకెళ్లకుండా ఆప్ నేతలు అడ్డుకున్నారు. ఆయుష్మాన్ భారత్ లాభం దిల్లీ ప్రజలకు దక్కకుండా చేశారు. దిల్లీలో అభివృద్ధికి ఎవరు అడ్డు పడుతున్నారో ప్రజలు గ్రహించారు. అన్నీ ఆలోచించే డబుల్ ఇంజిన్ సర్కారును కోరుకున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధి చూడొచ్చు. మన పనితీరు చూసే అనేక రాష్ట్రాల్లో మళ్లీ మనకే అధికారం కట్టబెట్టారు” అని ప్రధాని తెలిపారు.
“హరియాణాలో సుపరిపాలనకు నాంది పలికాం. మహారాష్ట్ర రైతులకు అన్ని విధాలా అండగా ఉన్నాం. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారు. సుపరిపాలన ఫలాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు దక్కాయి. ఢిల్లీ మెట్రోను మొట్టమొదటి మనమే ప్రారంభించాం. అనేక నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నాం. డిల్లీని వాయుకాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పీడిస్తున్నాయి. డిల్లీని సరికొత్త ఆధునిక నగరంగా మారుస్తాం” అని మోదీ హమీ ఇచ్చారు.
అభివృద్ధి, విజన్, నమ్మకానికి దక్కిన విజయమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయమని మోదీ పేర్కొన్నారు. గందరగోళం, దురహంకారం, వంచనా రాజకీయాలను ఢిల్లీ ప్రజలు ఈరోజు తిప్పికొట్టారని, ఈ విజయం అవిశ్రాంతంగా పోరాడిన ప్రతి బీజేపీ కార్యకర్తకు దక్కుతుందని అభినందించారు. మార్పు కోరుతూ ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం సిటీగా పరిమితం కాదని, యావద్దేశానికి వర్తించే చరిత్రాత్మక తీర్పు అని మోదీ శ్లాఘించారు. భిన్న సంస్కృతులకు నిలయమైన ఢిల్లీని ‘మినీ హిందుస్థాన్’ అని ఆయన కొనియాడారు.
ఢిల్లీలో చరిత్రాత్మక విజయం సాధించారని, అందుకోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. “మోదీ నేతృత్వంలో పార్టీ వరుస విజయాలు సాధిస్తోంది. ఢిల్లీ ప్రజలు మన పార్టీపై విశ్వాసం ఉంచారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ డిల్లీ ప్రజలు మన పార్టీని గెలిపించారు” అని గుర్తు చేశారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం