
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన పదవి రాజీనామా లేఖను అందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఎదురైన భారీ పరాజయం నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై ఆమె కల్కాజీలో 3,521 ఓట్ల తేడాతో విజయ సాధించారు.
అయితే ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొత్తంగా 48 సీట్లు గెల్చుకుని భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఢిల్లీ శాసనసభను రద్దు చేశారు.
ప్రజలు మళ్లీ తనను మళ్లీ గెలిపించే వరకూ పదవిలో ఉండను అంటూ సీఎంగా ఆతిశీని ప్రతిపాదించారు. దీంతో ఆమె అనూహ్యంగా ఆతిశీ సీఎం పదవిని చేపట్టారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, సీఎం అభ్యర్థిగా ఎవరని నిర్ణయిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక న్యూఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవా.. అసెంబ్లీకి ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో ఆదివారం సాయంత్రం సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై వారితో ఆయన చర్చించనున్నారు.
మరోవైపు ప్రధాని మోదీ ఈ నెల 10 నుంచి ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లనున్నారు. ఆయన తిరిగి వచ్చాకనే ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేవీ నడ్డా వెళ్లారు. ఢిల్లీ సీఎం విషయంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
2015లో అప్పటి విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు అతిషి సలహాదారుగా నియమితులయ్యారు. విద్యా వ్యవస్థను పునరుద్ధరించడానికి, మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఆప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. దీంతోపాటు ఆమె ఆప్ అధికార ప్రతినిధిగా, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు.
2019లో ఆమె తూర్పు ఢిల్లీ స్థానం నుంచి బీజేపీకి చెందిన గౌతమ్ గంభీర్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. కానీ 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కల్కాజీ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు. ఆమె క్యాబినెట్ మంత్రిగా అనేక శాఖలను నిర్వహించారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం