
ఈ క్రమంలో ఐటీ నిపుణులకు మంచి అవకాశం ఇచ్చేందుకు న్యూజిలాండ్ కొత్త వీసా నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఉద్యోగులను తమ దేశంలోకి రప్పించేందుకు న్యూజిలాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా ఐటీ నిపుణులకు ఆకర్షణీయమైన వీసా నిబంధనలను ప్రకటించింది.
ఈ నిబంధనలు భారత ఐటీ నిపుణులకు బంపర్ ఆఫర్‌గా చెప్పవచ్చు. అమెరికాలో ఇండియన్ వర్క్ వీసా సంబంధిత నియమాలు మారడంతో అనేక మంది వలసదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు కఠినంగా మారినందున న్యూజిలాండ్ ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
అమెరికా నుంచి ఐటీ నిపుణులను ఆకర్షించడానికి ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశంలో స్థిరపడాలని ఆశపడేవారి ఆలోచనలను మార్చుకునేలా చేశాయి. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ హక్కు రద్దు, గ్రీన్ కార్డు, వీసా నిబంధనలను కఠినతరం చేయడం లాంటి నిర్ణయాలు ముఖ్యంగా భారతీయులపై ప్రభావం చూపించాయి. భారతదేశం నుంచి ఎక్కువగా ఐటీ ఉద్యోగులు తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్