8 మంది బందీలను విడుదల చేసిన హమాస్

8 మంది బందీలను విడుదల చేసిన హమాస్

కాల్పుల విరమణ తర్వాత హమాస్ మిలిటెంట్లు గురువారం తొలి దఫా ఎనిమిది మంది యూదు బందీలను విడుదల చేశారు. ఇజ్రాయెల్ కూడా 110 పాలస్తీనా బందీలను విడుదల చేయగలదని భావిస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య 2023 అక్టోబర్ 7 నుంచి యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధం చాలా వినాశకరంగా కొనసాగింది.

హమాస్ మిలిటెంట్లు జనం ముందు అటుయిటు తిప్పాక ఇజ్రాయెల్ మహిళా సైనికురాలు ఆగం బెర్జర్(20)ని రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. ఆ తర్వాత ఆగం బెర్జర్ తమ దళాల వద్దకు చేరుకుందని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.  2023, అక్టోబర్‌ 7న హమాస్‌ బందీలుగా పట్టుకున్న 100 మందిలో బెర్గర్‌ సహా ఐదుగురు సైనికులు  ఉన్నారు. 

మిగిలిన నలుగురు సైనికులను శనివారం (జనవరి 25)న విడుదల చేశారు.  బెర్గర్‌తో పాటు మరో ఇద్దరు ఇజ్రాయిలీలు అర్బెల్‌ యెహౌద్‌, మోసెస్‌లను హమాస్‌ గురువారం విడుదల చేశారు.  బెర్జర్ అప్పగింత సమయంలో టెల్ అవీవ్ స్వేర్ వద్ద ప్రజలు చప్పట్లు కొడుతూ, విజిల్ వేస్తూ స్వాగతించారు. మరికొందరైతే ‘ఆగం నీ రాక కోసం వేచి ఉన్నాము…’ అంటూ పాడారు కూడా. అర్బెల్ యెహూద్(29), గడి మోసెస్(80) అనే ఇద్దరు ఇజ్రాయెళ్లను కూడా విడుదల చేశారు. 

విడుదల కానున్న థాయ్ జాతీయుల గురించిన అధికారిక వివరాలు తెలియలేదు.  2023 నవంబర్‌లో వారం రోజుల కాల్పుల విరమణ సమయంలో 100 మందికి పైగా బందీలలో ఇరవై మూడు మంది థాయ్‌లు  ఉన్నారు. మరో ఎనిమిది మంది హమాస్‌ చెరలో ఉన్నారని ఇజ్రాయిల్‌ చెబుతోంది. వారిలో ఇద్దరు మరణించినట్లు అనుమానిస్తున్నారు.

ఇదిలావుండగా ఇజ్రాయెల్ సోమవారం నుంచే స్వస్థలాల నుంచి తరలిపోయిన పాలస్తీనీయులను తిరిగి ఉత్తర గాజాకు రావడానికి అనుమతించింది.  వేలాదిగా పాలస్తీనీయులు తిరిగి స్వస్థలానికి తరలివస్తున్నారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ అమలులో ఉంది. కానీ పరిస్థితి చాలా క్లిష్టంగా కూడా ఉంది. కాల్పుల విరమణ అమలులోకి వచ్చాక హమాస్ మహిళలు, పిల్లలు, వృద్ధులైన 33 మంది ఇజ్రాయెల్ బందీలను తొలి దఫాలో విడుదల చేసింది. 

కాగా ఇజ్రాయెల్ సైతం 2000 మంది పాలస్తీనీయులను విడుదల చేసింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా గాజాలోని 90 శాతం మంది ప్రజలు నిర్వాసితులయ్యారు.