పార్లమెంట్ సమావేశాలు ఈ సారి సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేస్తూ పార్లమెంట్‌లో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపునిస్తాయని చెబుతూ ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ బడ్జెట్ వికసిత్ భారత్‌కు ఊతం ఇస్తుందనిపేర్కొంటూ వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ఇన్నోవేషన్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు చెప్పారు. కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని మోదీ వివరించారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరిగేలా సభ్యులు సహకరించాలని, బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

More Stories
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగాట్
తిరువనంతపురం, కోచి, కన్నూర్, త్రిసూర్ లలో హంగ్ మున్సిపాలిటీలు!
కర్ణాటకలో డ్రగ్స్ నేరాలకు పాల్పడితే కూల్చివేతలే!