
వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జనవరి 25వ తేదీన శ్రీలంకకు వెళ్తుండగా, జక్రియాను పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నిందితుడు జక్రియా సుమారు పదేళ్లుగా బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. జక్రియాకు కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు జక్రియా కదలికలపై నిఘా ఉంచారు.
ఇందులో భాగంగానే జక్రియా శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిజంగానే జక్రియాకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా?ఉంటే ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎలాంటి సమాచారం అందించే వాడు? జక్రియాతో పాటు ఇలా ఇంకెంత మంది ఉన్నారు? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అయితే. జక్రియా అసలు స్వస్థలం పాకిస్థాన్. 32 సంవత్సరాల క్రితమే భారత్ కు వచ్చిన జక్రియా ముందుగా ఎపిలోని గుంటూరులో స్థిరపడ్డారు. 25 సంవత్సరాల క్రితం వరంగల్‌కు వచ్చి జానిపీరీలో స్థిరపడ్డాడు. కాగా వరంగల్‌లోని శివనగర్ అండర్ బ్రిడ్జి దగ్గర రాయల్ బావర్చి బిర్యాని పాయింట్ నడిపిస్తున్నాడు. అయితే.. జనవరి 25న ఖలీఫా ఎన్నికల కోసం శ్రీలంకకు వెళ్తుండగా చెన్నై ఎయిర్ పోర్టులో అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం పోలీసుల బృందం జక్రియాను విచారిస్తోంది. నిజంగానే జక్రియాకు ఉగ్రవాదులతో సంబంధం ఉందా? లేక కేవలం అనుమానమేనా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు వరంగల్lలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో స్థానికంగా ప్రజలు తీవ్ర భయాందళోనలకు గురవుతన్నారు. పోలీసులు కూడా అప్రమత్తమై మరింత నిఘా పెంచారు.
2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దిల్ సుఖ్ నగర్ లో ఉగ్రవాదులు రెండు చోట్ల బాంబు పేల్చారు. అప్పటికీ తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉగ్రవాదుల ఊసే లేదు. తెలంగాణలోకి ఉగ్రవాదులు ప్రవేశించాలని చూస్తే, వారిని పోలీసులు అరెస్ట్ చేసే వారు. కానీ తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాకుండా వరంగల్‌లో ఉగ్రవాదుల కలకలం సృష్టించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత