
ఎన్నో మైలురాళ్లను సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో చారిత్రక ఘనతను సాధించింది. ఇస్రో వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహకరి కోటలోని షార్ నుంచి ఎస్‌ఎల్వీ రాకెట్-15 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి తీసుకెళ్లింది.
భారత నావిగేషన్ వ్యవస్థ నావిక్ సిరీస్‌లోని ఈ రెండో ఉపగ్రహం కచ్చితమైన పొజిషన్, వేగం, టైమింగ్‌తో భారత ఉపఖండం అవతల 1500 కి.మీ పరిధి వరకు యూజర్లకు కచ్చితమైన గమన సూచనలు (నావిగేషన్, ముఖ్యంగా నౌకాయానం) అందిస్తుంది. 50.9 మీటర్ల పొడవైన రాకెట్ జీఎస్‌ఎల్వీ-ఎఫ్12 మిషన్‌లో ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని గతేడాది మే 29 విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది.
నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న 2,250 కిలోల బరువైన ఎన్‌వీఎస్-02 శాటిలైట్‌ను యూఆర్ శాటిలైట్ కేంద్రంలో రూపొందించి అభివృద్ధి పరిచారు. ఇందులో రేజింగ్ పేలోడ్‌కు అదనంగా ఎల్1, ఎల్5 నావిగేషన్ పేలోడ్లు ఉన్నాయి. ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్ సమాచారాన్ని గగనతల, భూతల, జల మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. విమానాల నిర్వహణకు, మొబైల్స్‌లో స్థాన ఆధారిత సేవలకు, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లకు, ఈ ఉపగ్రహపు నావిగేషన్‌ను వాడుకోవచ్చని ఇస్రో తెలిపింది.
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి. నారాయణన్ నియమితులైన తర్వాత జరుగుతున్న తొలి ప్రయోగం కూడా ఇదే. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ) తన 17వ ప్రయోగంలో స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఎన్వీఎస్-2 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. అంతేకాక ఇది ఎన్వీఎస్-01 మాదిరిగా అదనపు సీ-బ్యాండ్లో కూడా పేలోడ్‌ను కలిగి ఉంది. ఈ భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్, వ్యవసాయంలో సాంకేతికతకు, విమానాల నిర్వహణ కోసం, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది
ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ మాట్లాడుతూ.. శ్రీహరికోట నుండి బుధవారం ఉదయం ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్ -02 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి చేర్చడం జరిగిందని తెలిపారు. ప్రయోగం జరిగిన 19 నిమిషాల 10 సెకండ్ల రాకెట్ ప్రయాణం తరువాత ఉపగ్రహం కక్షలోకి చేరుకుందని చెబుతూ ఈ ఎన్‌వీఎస్ -02 ఉపగ్రహం 10 ఏళ్ళ పాటు అంతరిక్షం నుంచి నావిగేషన్ సేవలు అందిస్తుందని, ఈ ప్రయోగ విజయం భారత దేశానికి ముఖ్యమైన మైలురాయి అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది ఇస్రో ప్రయోగించిన వందవ రాకెట్ కావడంతో ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొంటూ ఇస్రో విశిష్ట ప్రయోగాల అభివృద్ధిలో సతీష్ ధావన్, ఏపీజే అబ్దుల్ కలామ్ అందించిన సేవలు మరువలేనివని చెప్పారు. ఇస్రో ఇప్పటి వరకు తన 100 ప్రయోగాల ద్వారా 548 శాటిలైట్‌లను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టిందని డాక్టర్ నారాయణన్ పేర్కొన్నారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్