ఐసీసీ వుమెన్స్ అండర్-19 ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. మంగళవారం స్కాట్‌లాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించి రికార్డును నెలకొల్పింది. వుమెన్స్ అండర్-19 ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించిన తొలి వుమెన్స్ క్రికెటర్‌గా నిలిచింది. అదే సమయంలో బంతితోనూ రాణించి మూడు వికెట్లు పడగొట్టింది.
మలేషియాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ సూపర్ సిక్స్ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన భారత్ మంగళవారం స్కాంట్లాండ్‌తో తలపడి ఐదో మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది. స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డ్ ఎంచుకుంది. ఓపెనర్లు కమలిని, గొంగడి త్రిష చెలరేగి ఆడారు. ఓపెనర్లు కమలినీ, త్రిష గొంగాడి బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 67-0తో బలమైన స్కోరును సాధించింది. పది ఓవర్లు ముగిసే వరకు భారత్ వికెట్ నష్టపోకుండా 104 పరుగులతో చేసింది.
ఓపెనర్లు ఇద్దరు కలిసి ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి వికెట్‌కు ఇద్దరు అజేయంగా 147 పరుగులు జోడించారు. మ్యాచ్‌లో ముఖ్యంగా తెలంగాణ అమ్మాయి త్రిష 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది.
కమిలిని 42 బంతుల్లో 51 పరుగులు చేయగా, మరో బ్యాట్స్‌వుమెన్ సానికా చల్కే 20 బంతుల్లో 29 పరుగులు చేసింది. ముగ్గురు చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 58 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడగా, బౌలర్లు స్కాట్లాండ్‌ను బౌలింగ్‌తో వణికించారు. ఆయుషి శుక్లా మూడు ఓవర్లు వేసి 8 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టింది. వైష్ణవి శర్మ ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా, గొంగడి త్రిష రెండు ఓవర్లు వేసి, ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన త్రిష ఈ టోర్నీలో అద్భుతంగా ప్రదర్శన ఇస్తూ, టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది. ఆమె 230 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది.19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌వుమన్, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్‌గా కూడా ఆమె క్రికెట్‌లో తన ప్రతిభను కనబరిచింది.
ఆమె ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. మలేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో, త్రిష తన అవినాభావ కౌశలంతో అన్ని దృష్టులను ఆకర్షిస్తోంది. ఆమె ప్రతి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనను కనబరిచి, భారత క్రికెట్ ప్రేమికుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అంతే కాదు, ఆమె ప్రతిభ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్