
* మహా కుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బిహార్లోని ముజఫర్పూర్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. ఈ కేసులో మధ్యప్రదేశ్లోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుంభమేళా స్నానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్థానిక న్యాయవాది సుధీర్ ఓజా కోర్టులో ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మనోభావాలను దెబ్బ తీశారని ఆయన ఆరోపించారు.
రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు సనాతన హిందువుల మనోభావాలతో ఆటలాడారని అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్గే వ్యాఖ్యలు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 3న విచారించేందుకు కోర్టు నిర్ణయించింది. ఫిర్యాదులో మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు ప్రజాశాంతికి భంగం కలిగించినట్లు ఆరోపించారు.
ఈ కేసుపై కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో సోమవారం స్నానం చేశారు. దీనిపై మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ గంగానదిలో స్నానం చేయడం వల్ల పేదరికం అంతమవుతుందా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కెమెరాల కోసం స్నానం చేసేందుకు పోటీపడుతున్నారని ఆరోపించారు.
మోవ్లో జరిగిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తాను ఎవరి విశ్వాసాలను ప్రశ్నించడం లేదన్న ఆయన తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
పిల్లలు ఆకలితో చనిపోతున్నారని, పాఠశాలలకు వెళ్లడం లేదని, కార్మికులకు జీతాలు అందడం లేదన్న ఆయన వేలాది రూపాయలు ఖర్చు చేసి గంగానదిలో స్నానం చేసేందుకు పోటీపడుతున్నారని అంటూ విమర్శించారు. దేవుడిపై తనకు నమ్మకం ఉందన్న ఆయన.. మతం పేరుతో పేదలను దోపిడీ చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
‘నేను ఎవరి విశ్వాసాన్ని ప్రశ్నించడం లేదు. ఎవరైనా తప్పుగా భావిస్తే క్షమాపణ కోరతాను. కానీ, నాకో విషయం చెప్పండి. పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. పాఠశాలలకు వెళ్లడం లేదు. కార్మికులకు బకాయిలు అందడం లేదు. ఇలాంటి సమయంలో వేల రూపాయలు ఖర్చుపెట్టి గంగా నదిలో స్నానం కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి వారు దేశానికి మేలు చేయలేరు’ అని స్పష్టం చేశారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’