
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలు రాయికి చేరుకునేందుకు సిద్ధమైంది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వందో ప్రయోగం చేపట్టనున్నది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. ఈ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని భారత్ స్పేస్‌లోకి పంపనున్నది. అయితే, జీఎస్‌ఎల్‌వీ-15 రాకెట్‌తో ఎన్‌వీఎస్ ఉపగ్రహం అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యిందని ఇస్రో సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొంది.
ప్రయోగం సందర్భంగా కౌంట్‌డౌన్‌లో మూడురోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని ఇస్రో పేర్కొంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 15 రాకెట్ ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని భూస్థిర లక్ష్యలో ప్రేవశపెడుతుందని పేర్కొంది. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఉపగ్రహం సెకండ్ జెనరేషన్ శాటిలైట్ కాగా, ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది.
ఇది ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం ఎన్‌వీఎస్ సిరీస్‌లో రెండో ఉపగ్రహం. ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్‌లలో నావిగేషన్ పేలోడ్లను.. అలాగే తొలితరం ఉపగ్రహం ఎన్‌వీఎస్-01లో ఉన్నట్లుగానే సీబ్యాండ్‌లో రేజింగ్ పేలోడ్స్ ఉంటాయి. నావిక్ = అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ.
కాగా, గగనతలంలో మరోసారి ఇస్రో గేమ్ ఛేంజర్ అయిందని షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్ తెలిపారు. భారతజాతి మొత్తాన్ని ప్రపంచం తమ వైపు తిప్పుకునేలా చేసిందని తెలిపారు. గత నెల 30వ తేదీన శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సిఎస్‌ఎల్ వి సి- 60 రాకెట్ రెండు ఉపగ్రహాలను రోదశీలోకి ప్రవేశపెట్టిందని, వాటి అనుసంధాన ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ దిగ్విజయంగా ఆ ఘట్టాన్ని మన శాస్త్రవేత్తలు పూర్తి చేశారని తెలిపారు
రూ. 3984.86 కోట్లను శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ కు కేటాయిస్తున్నట్లు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, ఈ ప్రాజెక్టుతో భవిష్యత్తులో అతిపెద్ద ఉపగ్రహాలను మన రాకెట్ల ద్వారా ప్రయోగించడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.
More Stories
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి