నలుగురు మహిళా సైనికులను విడుదల చేసిన హమాస్‌

నలుగురు మహిళా సైనికులను విడుదల చేసిన హమాస్‌

ఇజ్రాయెల్‌- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు మహిళా సైనికులను హమాస్‌ శనివారం విడుదల చేసింది. ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చి రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. అనంతరం వారిని ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లారు.

హమాస్‌ శనివారం నలుగురు ఇజ్రాయిలీ మహిళా సైనికులను విడుదల చేస్తున్నట్లు శుక్రవారమే ప్రకటించింది. వీరు 2023 అక్టోబర్‌ 7 నుంచి తమ వద్ద బందీలుగా ఉన్నారని, రెండోసారి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా వీరిని విడుదల చేస్తున్నట్లు హమాస్‌ ప్రకటించింది. వీరు 2023 ఇజ్రియల్‌ సైన్యం దాడులు ప్రారంభించినప్పుడు గాజా సరిహద్దుకు కిలోమీటరు దూరంలో ఉన్న నహాల్‌ ఓజ్‌ సైనిక స్థావరం నుంచి హమాస్‌ గ్రూప్‌ వీరిని బందీల్ని చేసింది.

వీరిని విడుదల చేసినందుకు గానూ ఇజ్రాయెల్‌ సైతం 200కు పైగా పాలస్తీనియన్లను విడిచిపెట్టింది.  ప్రస్తుతం విడుదలైన మహిళా సైనికులను 2023 అక్టోబర్‌ 7న గాజా సరిహద్దుకు సమీపంలోని వహల్‌ ఓజ్‌ మిలిటరీ బేస్‌ నుంచి హమాస్‌ బంధించి తీసుకెళ్లింది. అప్పటి నుంచి 477 రోజులుగా ఆ మహిళా సైనికులు హమాస్‌ చెరలోనే ఉన్నారు. 

కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలిరోజు గాజా నుంచి ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను హమాస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రతిగా ఇజ్రాయెల్‌ కూడా తమ జైళ్లలో ఉన్న 100 మందికిపైగా పాలస్తీనియనన్లకు విముక్తి కల్పించి వారిని రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించింది.  కాగా, 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ చెరలో ఉన్న 2,000 మందిని ఇజ్రాయెల్‌ వదిలిపెట్టనుండగా, హమాస్‌ సైతం తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందికి విముక్తి కల్పించనుంది.