
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి ఆమనగల్లు మున్సిపాలిటీ మూడవ వార్డు సాకీబండ తండా గ్రీన్ ఫీల్డ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులకు పరామర్శించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు లో మూడు పంటలు పండించే భూములను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బాధితుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు అయ్యేలా ఉద్యమానికి ఉదృతం చేస్తామని, గిరిజన రైతులకు బిజెపి ఎల్లప్పుడు అండగా ఉంటుందని వారికి భరోసా చిహ్హ్హరు. 765 జాతీయ రహదారిని ఆరు లైన్లుగా చేసి దానినే మరింత అభివృద్ధి చేయండి కానీ రైతు భూములు గుంజుకోవాలని చూస్తే బిజెపి రైతుల పక్షాన పోరాడుతం రైతుల కోసమే నిలబడుతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.
గ్రీన్ ఫీల్డ్ రోడ్ పథకాన్ని వీరమించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన పక్షాన ఉద్యమం ఉదృతంగా చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే గిరిజనులు అభివృద్ధి చెంది జీవనశైలి మార్పు మొదలవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అడవికి దూరంగా పెట్టేటట్లు చూస్తుందని విమర్శించారు. కనుక వారు మూడు పంటలు పండించే భూములను కోల్పోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. తమ భూములు తమకే కావాలని గిరిజన రైతులు నినాదాలతో పచ్చటి పొలాల్లో మారుమోగడం జరిగింది.
తెలంగాణ బిజెపి పార్టీ ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ పేరుతో గిరిజన భూములను లాగుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరిని వీడనాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గిరిజన పక్షాన గిరిజన బిడ్డల కోసం ఎంతటి ఉద్యమమైన చేస్తామని స్పష్టం చేశారు.
“మా భూములను మేమే రక్షించుకుంటాం మరో లగచెర్ల కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి గ్రీన్ ఫీల్ రోడ్డును విరమించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రమంతటా గిరిజన తరుపున ఉద్యమానికి శ్రీకారం చుట్టుతాం. అన్యాయంగా రైతుల భూములను లాగుకుంటే మేము ఎంతటికైనా తెగిస్తాం” అంటూ గిరిజన రైతులు తమ భూములను మాత్రం ఇవ్వమని కరాకండిగా చెప్పారు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్