
జనవరి 26 న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న వేళ కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, పౌర భద్రత రంగాలకు చెందిన 942 మందికి గ్యాలంట్రీ, సర్వీస్ పతకాలు ప్రకటించింది. ఈ పోలీస్ పతకాలు లభించిన వారిలో 12 మంది తెలంగాణ వారు ఉన్నారు. సైనికులకు అందించే అత్యున్నత పురస్కారాలలో రెండోది అయిన కీర్తి చక్ర అవార్డు ఈసారి ఇద్దరికి ప్రదానం చేయనున్నారు.
రాష్ట్రీయ రైఫిల్స్ 22వ విభాగానికి చెందిన మేజర్ మంజీత్‌తో పాటుగా, రాష్ట్రీయ రైఫిల్స్ 28వ విభాగానికి చెందిన నాయక్ దిలావర్ ఖాన్లకు కీర్తి చక్ర అవార్డు ప్రకటించారు. పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ మంజీత్ 2024 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో జరిగిన ఓ ఆపరేషన్‌లో తీవ్రవాదిని మట్టుబెట్టి పలువురు పౌరుల ప్రాణాలను కాపాడారు.
అలాగే భారత సైన్యంలోని సదరన్ ఆర్మీకి చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్, మాస్టర్ జనరల్ సస్టెన్స్ లెఫ్టినెంట్ జనరల్ అమర్ దీప్ సింగ్ అహూజాకు పరమ్ వికసిత్ సేవా మెడల్ ప్రకటించారు. లెఫ్టినెంట్ కమాండర్ సౌరభ్ మాలిక్‌కు నావో సేనా మెడల్ పురస్కారం ప్రకటించారు. వీటితో పాటుగా సాయుధ దళాలు, ఇతర సిబ్బందికి 305 డిఫెన్స్ డెకరేషన్స్ అవార్డులను రాష్ట్రపతి ప్రకటించారు.
101 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలలో 85 పోలీసు సేవకు, ఐదు అగ్నిమాపక సేవకు, ఏడు పౌర రక్షణ-హోంగార్డ్‌లకు, నాలుగు సంస్కరణల విభాగానికి లభించాయి. 746 మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎస్ఎం)పతకాలలో 634 పోలీసు సేవకు, 37 అగ్నిమాపక సేవకు, 39 సివిల్ డిఫెన్స్-హోం గార్డ్స్‌కు, 36 కరెక్షనల్ సర్వీస్‌కు లభించాయి.
రాష్ట్రాల వారీగా గ్యాలంట్రీ అవార్డుల డేటాను పరిశీలిస్తే ఈ అవార్డులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మందికి, ఒడిశాకు చెందిన ఆరుగురికి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 మందికి, జమ్ము కాశ్మీర్‌కు చెందిన 15 మంది పోలీసు సిబ్బందికి అందజేయనున్నారు. అస్సాం రైఫిల్స్ నుండి ఒక సైనికునికి, బీఎస్ఎఫ్ నుండి ఐదుగురు, సీఆర్పీఎఫ్ నుండి 19 మంది, ఎస్ఎస్బీ నుండి నలుగురికి శౌర్య పురస్కారాలు లభించాయి.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు