
భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 10-11 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరగనున్న ఎఐ యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం వెల్లడించారు.
ఈ సమ్మిట్‌కి నరేంద్ర మోదీ సహ అధ్యక్షత వహిస్తారని జైశ్వాల్ తెలిపారు. మోదీ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ సమ్మిట్‌కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైతే, మోదీ ఆయనను కలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ సమ్మిట్‌కి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది.
కాగా, ఫిబ్రవరి 10-11 తేదీల్లో జరిగే ఎఐ యాక్షన్ సమ్మిట్ ఫ్రాన్స్‌లోని గ్రాండ్ పలైస్‌లో జరగనుంది. ఈ సమ్మిట్‌కి ఆ దేశాధినేతలతోపాటు, అంతర్జాతీయ సంస్థల నాయకులు, చిన్న, పెద్ద కంపెనీల సిఇఓలు, విద్యావేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు, కళాకారులు, పౌర సమాజ సభ్యులు పాల్గొంటారు.
దాదాపు వంద దేశాలు, వెయ్యికి పైగా ప్రైవేటు రంగం, ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజ ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారని ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ఎఐ గవర్నెస్‌గా ఏర్పడేందుకు గల సాధ్యాసాధ్యాలపైనా, ఎఐ వల్ల ప్రమాదాల గురించి ఈ సమ్మిట్‌లో చర్చించే అవకాశం ఉంది.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్