
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఇటుకలు, రాళ్లతో దాడి జరిగింది. శనివారంనాడు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
బీజేపీ ‘గూండాలే’ ఈ దాడికి పాల్పడినట్టు ఆప్ ఒక ట్వీట్‌లో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించింది.
‘ఓటమి భయంతో బీజేపీ ఆందోళన చెందుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి తన గూండాలను ఉపయోగించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. ఆయనను గాయపరిచేందుకు ప్రయత్నించారు. కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా చేయాలనుకున్నారు. బీజేపీ వ్యక్తుల పిరికి దాడికి కేజ్రీవాల్ భయపడరు. ఢిల్లీ ప్రజలు మీకు తగిన సమాధానం ఇస్తారు’ అని ఎక్‌లో పే్కొంది.మరోవైపు ఆప్ ఆరోపణలను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఖండించారు. అరవింద్ కేజ్రీవాల్ వాహనం ఇద్దరు యువకులను ఢీకొట్టిందని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు వచ్చినప్పుడు కారుతో ఆ యువకులను ఢీకొట్టారని, ఆ ఇద్దర్నీ లేడీ హార్డింగ్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఓటమి తప్పదని గ్రహించిన కేజ్రీవాల్ ప్రజల ప్రాణాలను కూడా లెక్కచేడయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రజలు ప్రశ్నలు అడుగుతుండగా, అరవింద్ కేజ్రీవాల్ తన కారుతో ఇద్దరు యువకులను ఢీకొట్టారు. వారిద్దరినీ లేడీ హార్డింగ్ ఆసుపత్రికి తరలించారు. ఓటమిని ఎదురుగా చూసిన ఆయన, ప్రజల ప్రాణాల విలువను మరిచిపోయారు. నేను ఆసుపత్రికి వెళ్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
More Stories
శ్రీరాముడే స్ఫూర్తిగా ఆపరేషన్ సింధూర్
ప్రముఖ నటుడు గోవర్ధన్ అస్రానీ కన్నమూత
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి వేడుకలు