వేద పండితులు, తెలంగాణా సంస్కృత భారతి అధ్యక్షులు నరేంద్ర కాప్రే మాట్లాడుతూ సంస్కృత సంభాషణ ప్రచారం గత 44 సంవత్సరములుగా నిరంతరం జరుగుతున్నదని తెలిపారు. భారతీయులందరూ సంస్కృతంలో మాట్లాడుటకు అర్హులని, అందరూ సంస్కృతం నేర్చుకొవాలని చెబుతూ ప్రజలందరికీ సంస్కృత భాషను నేర్పించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
ముఖ్య అతిథులుగా ్చేసిన అమెరికా సంస్కృత భారతి అధ్యక్షులు నటేశ జానకీరామన్ మాట్లాడుతూ అమెరికాలో సంస్కృత భాషా ప్రచారము ఏవిధంగా జరుగచున్నదో, అమెరికాలో ఎంత శ్రద్ధగా అందరూ నేర్చుకుంటున్నారో వివరించారు.
అఖిల భారత బాలకేంద్ర ప్రముఖులు ఉపద్రష్ట వెంకటరమణ మూర్తి, ప్రొ. నీలకంఠం, అఖిలభారత సహసంఘటన ప్రముఖులు దత్తాత్రేయ వఝ్రెళి, చిలుకమర్రి లక్ష్మీనరసిమ్హాచార్యులు సంస్కృతం ప్రాముఖ్యము గురించి మాట్లాడారు. సంస్కృత భారతీకి చెందిన తెలంగణాలోని 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.

More Stories
భారత్ అండర్ -19 జట్టు కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు
నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు
21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్న జగన్!