వైట్‌హౌస్‌పై దాడి కేసులో సాయి వ‌ర్షిత్‌కు 8 ఏళ్ల జైలు

వైట్‌హౌస్‌పై దాడి కేసులో సాయి వ‌ర్షిత్‌కు 8 ఏళ్ల జైలు
రెండేళ్ల క్రితం శ్వేత‌సౌధంపై ట్ర‌క్కుతో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించిన భార‌త సంత‌తి వ్య‌క్తి సాయి వ‌ర్షిత్‌ కు 8 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. 2023, మే 22వ తేదీన 20 ఏళ్ల కందుల సాయి త‌న వ‌ద్ద ఉన్న ఓ ట్ర‌క్కుతో వైట్‌హౌజ్‌పై ద‌సూకెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా ఎన్నికైన అమెరికా ప్ర‌భుత్వాన్ని కూల్చి, నియంతృత్వ నాజీ ఐడియాల‌జీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్న ల‌క్ష్యంతో కందుల సాయి ఆ దాడి చేసిన‌ట్లు న్యాయ‌శాఖ పేర్కొన్న‌ది.

నేరం చేసినట్లు అంగీక‌రించిన సాయి త‌న‌పై శిక్ష‌ను త‌గ్గించాల‌ని కోరాడు. చండీఘ‌డ్‌లో పుట్టిన సాయి వ‌ర్షిత్‌కు అమెరికాలో ప‌ర్మినెంట్ రెసిడెన్ష్‌కు కావాల్సిన గ్రీన్ కార్డు ఉన్న‌ది. 8 ఏళ్ల జైలుశిక్ష‌తో పాటు కందుల సాయి మూడేళ్ల పాటు సేవ చేయాల‌ని జిల్లా కోర్టు జ‌డ్జి డాబ్నే ఫ్రెడ్రిచ్ త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు.  అతడి చర్యల వల్ల ధంసమైన ని్మాణాలను తొలగించేందుకు, పునర్‌నిర్మించేందుకు యుఎస్‌డి 4,322 డాలర్లు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

సాయి వర్షిత్‌ అద్దె ట్రక్కుతో 2023 మే 22న వైట్‌హౌస్‌పై అద్దె ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, దోచుకున్నారనే అభియోగాలను నిందితుడు గతేడాది మేలో అంగీకరించినట్లు పోలీసులు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ వర్గాలు తెలిపాయి.

దాడికి కొన్ని వారాల ముందే ప్లాన్‌ చేసినట్లు పేర్కొన్నాయి. భారత్‌లోని చందానగర్‌లో జన్మించిన సాయి వర్షిత్‌ గ్రీన్‌కార్డ్‌తో అమెరికాలో చట్టబద్దంగా శాశ్వత నివాసాన్ని పొందారు.  కోర్టు పత్రాల ప్రకారం.. 2023 మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నుండి అతను వాషింగ్టన్‌ డిసికి చేరుకున్నాడు. సాయంత్రం 6.30 గంటలకు ఓ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 9.35 గంటలకు వైట్‌హౌస్‌కు చేరుకుని ఫుట్‌పాత్‌పై వాహనాన్ని నడిపాడు.

పాదచారులు భయాందోళనలతో పరుగులు తీశారు. అనంతరం వైట్‌హౌస్‌ ఉత్తర భాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టాడు.  ట్రక్కును రివర్స్‌ చేసి మరోసారి బారియర్స్‌పైకి దూసుకువెళ్లాడు. ఇంజిన్‌ నుండి పొగరావడం, పెట్రోల్‌ లీక్‌ కావడంతో ట్రక్కును నిలిపివేశాడు. అనంతరం నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుంది.