
‘వికసిత్ భారత్’ స్ఫూర్తి దేశ ప్రతి అడుగును, విధానాన్ని, నిర్ణయాన్ని మార్గనిర్దేశకం చేస్తుంటే భారత్ అభివృద్ధి చెందిన దేశం కాకుండా ఏ శక్తీ అడ్డుకోజాలదని ఆయన తేల్చి చెప్పారు. దేశ యువ జనాభా బలం, సంఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. ‘ముందుకు సాగడానికి ఏ దేశానికైనా భారీ లక్షాలు నిర్దేశించ వలసి ఉంటుంది. ఇప్పుడు భారత్ ఇదే చేస్తోంది’ అని ప్రధాని చెప్పారు.
దేశం వివిధ రంగాల్లో గడువు కన్నా ముందే ఎన్నో లక్ష్యాలు సాధిస్తోందని ఆయన తెలిపారు. 2030 నాటికల్లా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిళితం చేయాలని భారత్ లక్ష్యం నిర్దేశించుకున్నదని, ఆ లోగానే దేశం లక్ష్యం చేరుకుంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఒక్కటే దేశాన్ని ముందుకు తీసుకుపోజాలదని ప్రధాని పేర్కొన్నారు.
‘వికసిత్ భారత్’ మోదీ ఒక్కరిదే కాదని, మీ అందరిదీ అని పేర్కొంటూ ఈ సదస్సు కోసం దేశం అంతటి నుంచి వచ్చిన యువజనులతో ఆయన చెప్పారు. వారి అభిప్రాయాలు దేశ విధానాల్లో భాగం అవుతాయని, దేశానికి దిశ సూచిస్తాయని ఆయన తెలిపారు. ఆశావహ లక్షాల సాధనకు దేశంలోని ప్రతి పౌరుని క్రియాశీలక భాగస్వామ్యం, సంఘటిత కృషి అవసరమని ఆయన సూచించారు.
భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన ఆవశ్యకత గురించి చెప్పడానికి ప్రధాని మోదీ 1930 దశకంలో ఆర్థిక సంక్షోభం దరిమిలా యుఎస్ ఉత్థానాన్ని, మౌలిక సౌకర్యాలు లేని వెనుకబడిన ప్రాంతం నుంచి ప్రధాన ఆర్థిక శక్తిగా సింగపూర్ వృద్ధి చెందడాన్ని ఉటంకించారు.
భారత్ ఏ విధంగా బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారిందీ, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి, తన జనాభాకు టీకాలు వేసిందీ ప్రధాని మోదీ వివరించారు. 2047 వరకు 25 సంవత్సరాలు భారత్‌కు అమృత్ కాలం అని స్పష్టం చేస్తూ, యువ జనాభా వికసిత్ భారత్ కలను సాఫల్యం చేస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన తెలియజేశారు.
ఆకస్మిక పరివర్తనకు ఇదే తగిన సమయం అని ఆయన తెలిపరు. వచ్చే దశాబ్దంలో ఒలింపిక్స్‌ను నిర్వహించాలని కూడా దేశం ఆశిస్తోందని, పూర్తి అంకితభావంతో ఆ దిశగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. స్వామి వివేకానందకు యువతరంపై అపార విశ్వాసం ఉందని, అన్ని సమస్యలకు యువజనులు పరిష్కారాలు కనుగొనగలరని అన్నారని ఆయన తెలియజేశారు.
తనకు ఆయన మాటలపై సంపూర్ఱ విశ్వాసం, ‘గుడ్డి నమ్మకం’ ఉన్నాయని మోదీ చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన జయంతిని జాతీయ యువజనోత్సవంగా పాటిస్తున్నారు. భారత అభివృద్ధిలో అధిక వృద్ధి పాత్ర గురించి ప్రధాని నొక్కిచెబుతూ, వివిధ రంగాల్లో దేశ సామర్థం, బడ్జెట్ ఆర్థికవ్యవస్థ వృద్ధితో ఎలా వృద్ధిచెందాయో తెలియజేశారు.
మౌలిక వసతుల కోసం బడ్జెట్ పది సంవత్సరాల్లో ఆరింతలు అయిందని ఆయన తెలిపారు. భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడానికి ముందుకు సాగుతోందని ప్రధాని స్పష్టం చేస్తూ, వచ్చే దశాబ్దం నాటికి అది 10 ట్రిలియన్ డాలర్లను అధిగమిస్తుందని సూచించారు.
More Stories
కోల్కతాలో భారీ వర్షం… విద్యుత్ షాక్ లకు 9 మంది మృతి
మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం