
రామ్ లల్లా ప్రతిష్టాపన వార్షికోత్సవం కోసం అయోధ్య సిద్ధమవుతోంది. జనవరి 11 నుండి 13 వరకు జరిగే ఈ వేడుకలను గత సంవత్సరం జరిగిన చారిత్రాత్మక వేడుకకు హాజరు కాలేకపోయిన సామాన్యులకు, 110 మంది ఆహ్వానితులైన విఐపిలతో సహా పాల్గొనే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.
ఈ వారాంతంలో అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 11 నుండి 13 వరకు జరుగనున్న ఈ వేడుకలలో, ఆలయ ట్రస్ట్ ప్రకారం, గత ఏడాది చారిత్రాత్మక వేడుకకు హాజరు కాలేకపోయిన ప్రజలను కూడా ఆహ్వానించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
5,000 మందికి వసతి కల్పించేలా జర్మన్ హ్యాంగర్ టెంట్ ఏర్పాటు చేశారు. పెవిలియన్, యజ్ఞశాలలో శాస్త్రీయ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆచారాలు, రోజూ రామకథా ఉపన్యాసాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 110 మంది విఐపిలు సహా ఆహ్వానితులకి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ ప్రకటించింది.
ఈ విఐపిలలో చాలా మంది జనవరి 22, 2024 న జరిగిన అసలు ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరుకాలేకపోయినవారే. రోజువారీ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 గంటలకు రామకథా సెషన్లు ప్రారంభమవుతాయి, తర్వాత రామచరిత మానస్, సాంస్కృతిక ప్రదర్శనలపై ఉపన్యాసాలు నిర్వహిస్తారు. ప్రతి ఉదయం ప్రసాదం పంపిణీ కార్యక్రమం కూడా ప్రణాళికలో ఉంది. ఈ కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకోడంలో సహాయపడుతుంది.
ఆలయ ట్రస్ట్ కార్యాలయం ప్రకారం, యజ్ఞ స్థలంలో అలంకరణలు, పండుగకు సంబంధించిన సన్నాహాలు పూర్తవుతున్నాయి. పెవిలియన్, యజ్ఞశాల ఈ ఉత్సవాలకు ముఖ్యమైన వేదికలుగా పని చేస్తాయి, వీటిలో పాల్గొనడం ప్రజలకు అరుదైన అవకాశంగా ఉంటుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనవరి 11 న రామ్ లల్లా ‘అభిషేకం’ జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 11వ తేదీ అయోధ్య ధామ్ వద్ద కొత్తగా నిర్మించిన ఆలయ స్థాపనకు ఒక సంవత్సరం పూర్తి అవుతుంది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు