భారత స్పేస్ స్టేషన్‌ని సెటప్ చేసేందుకు ప్లాన్ జరుగుతోందని చెబుతూ స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రధాని మోదీ అనుమతి కూడా తమకు దక్కిందని వెల్లడించాయిరు. స్పేస్ స్టేషన్‌కు అయిదు మాడ్యూళ్లు ఉంటాయని పేర్కొంటూ 2028లో స్పేస్ స్టేషన్‌కు తొలి మాడ్యూల్‌ను లాంచ్ చేసే రీతిలో అనుమతి దక్కిందని తెలిపారు.
త్వరలో చేపట్టబోయే ఇస్రో ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఇస్రో చాలా కీలకమైన మిషన్లను చేపడుతున్నదని, ప్రస్తుతం ఇస్రో విజయవంతమైన దశలో వెళ్తోందని చెప్పారు. చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి వివరిస్తూ స్పేడెక్స్ మిషన్‌ను డిసెంబర్ 30వ తేదీన చేపట్టామని, జనవరి 9వ తేదీన స్పేడెక్స్ శాటిలైట్ల డాకింగ్ జరగనున్నట్లు ఆయన తెలిపారు. గగన్‌యాన్ కూడా ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రోగ్రామ్ అని పేర్కొన్నారు.
క్రూ లేకుండా మాడ్యూల్‌ను ప్రయోగించే దాని కోసం ఇస్రోలో పనులు జరుగుతున్నాయని, జీఎస్ఎల్వీ ద్వారా ఎన్వీఎస్ 02 నావిగేషన్ శాటిలైట్ను పంపేందుకు శ్రీహరికోటలో వర్క్ జరుగుతోందని తెలిపారు. ఇస్రో మాక్ 3 వెహికిల్ ద్వారా అమెరికాకు చెందిన కమర్షియల్ శాటిలైట్‌ను కూడా ప్రయోగించనున్నారని వెల్లడించారు.
గగన్‌యాన్ రాకెట్ అసెంబ్లింగ్‌కు చెందిన పనులు కూడా శ్రీహరికోట్లో ప్రోగ్రెస్ అవుతున్నాయని పేర్కొంటూ చంద్రయాన్3 ద్వారా చంద్రుడి దక్షిణ ద్రువంపై ల్యాండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే అని గుర్తు చేశారు . చంద్రయాన్ 4 ద్వారా ఆ ప్రదేశంలో చంద్రుడిపై ల్యాండ్ అయి, శ్యాంపిళ్లు సేకరించిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చే రీతిలో పనులు జరుగుతున్నాయని తెలిపారు.

More Stories
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగాట్
తిరువనంతపురం, కోచి, కన్నూర్, త్రిసూర్ లలో హంగ్ మున్సిపాలిటీలు!
కర్ణాటకలో డ్రగ్స్ నేరాలకు పాల్పడితే కూల్చివేతలే!