
* 29 మంది అభ్యర్థులతో ఢిల్లీ బీజేపీ మొదటి జాబితా
దేశ రాజధాని డిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ప్రకటించనప్పటికీ రాజకీయ వేడి మాత్రం రాజుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్ తమ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ డిల్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది.
న్యూడిల్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మని బీజేపీ బరిలో దింపింది. తొలి జాబితాలో 29 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఈ స్థానానికి మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పేరును ప్రకటించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది.
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ డిల్లీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డిల్లీ చరిత్రలో ఓ లోక్‌సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు