 
                ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల 15 న నిర్వహించనున్న “మకరవిలక్కు” ( మకరజ్యోతి) దర్శనం పండగకు భారీ ఎత్తున శరవేగంగా ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఆలయ అధికారులు వెల్లడించారు .
శబరిమలకు వచ్చే ప్రతి భక్తుడు సులువుగా దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా వెళ్లాలన్న లక్షంతో ఏర్పాట్లు చేస్తున్నామని శబరిమల అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అరుణ్ ఎస్ నాయిర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం రోజూ 90 వేల మంది కన్నా ఎక్కువ మంది భక్తులు శబరిమలకు వస్తుండటంతో విపరీతమైన రద్దీ ఉంటోందని నాయిర్ చెప్పారు.
ఈ మకరవిలక్కు పండగలో భాగంగా ఈనెల 12న పందలం నుంచి ‘తిరువాభరణం’ ఊరేగింపు ప్రారంభమవుతుందని తెలిపారు. పండగ సజావుగా సాగేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయని. ఈనెల 10 నాటికి ఊరేగింపునకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని నాయిర్ ప్రకటనలో పేర్కొన్నారు.
మకరవిలక్కు (మకరజ్యోతి) ని దర్శించడానికి భక్తులంతా ఎక్కవ భారీగా గుమికూడి ఉంటారో ఆయా ముఖ్యమైన ప్రదేశాల ఏర్పాట్లను పథనంహిట్ట జిల్లా కలెక్టర్ పరిశీలిస్తారని వివరించారు. గత డిసెంబర్ 30న శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని తెరిచారు. మండల పూజ తరువాత డిసెంబర్ 26న మూసివేశారు. ఏటా జరిగే 41 రోజుల సుదీర్ఘయాత్రకు సంకేతంగా ముందుగా అవన్నీ పూర్తి చేశారు.





More Stories
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు