ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త చిదంబ‌రం క‌న్నుమూత‌

ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త చిదంబ‌రం క‌న్నుమూత‌
ప్ర‌ముఖ అణు శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ రాజ‌గోపాల చిదంబ‌రం(88) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ముంబై జ‌స్‌లోక్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ  శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.  చెన్నైలో జన్మించిన చిదంబరం, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి పీహెచ్ డీ పొందారు.
 
 ఆయన 1962లో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. 1993లో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్‌గా బాధత్యలు చేపట్టిన ఈయన 2000 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1975, 1998లో భారత ప్రభుత్వం జరిపిన పోఖ్రాన్-1, పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలక పాత్ర అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించిన అతికొద్ది మంది శాస్త్రవేత్తలలో చిదంబరం ఒకరు.
 
 అమెరికాతో పౌర అణు ఒప్పందం చేసుకోవడం ద్వారా అంతర్జాతీయంగా అణు కార్యక్రమాలలో ఒంటరితనం పోగొట్టుకునేందుకు జరిగిన ప్రయత్నాలలో సహితం కీలక పాత్ర వహించారు.  రాజగోపాల‌కు 1999లో ప‌ద్మ‌విభూష‌ణ్‌, 1975లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు వ‌రించాయి. భార‌త ప్ర‌భుత్వానికి శాస్త్రీయ స‌ల‌హాదారుగా ప‌ని చేశారు.  
 
బాబా అటామిక్ రీసెర్చ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ కార్యదర్శిగా విధులు నిర్వ‌ర్తించారు. 1994-95 మ‌ధ్య కాలంలో ఇంట‌ర్నేష‌న‌ల్ అటామిక్ ఎన‌ర్జీ ఏజెన్సీ గ‌వ‌ర్న‌ర్ల బోర్డుకు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు.