హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల భూమిని కాపాడిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడిందని చెప్పారు. హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్జోన్లు నిర్ణయిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో హైడ్రా కమిషన్ రంగనాథ్ వార్షిక మీడియా సమావేశంలో రంగనాథ్ మాట్లాడుతూ, ఎన్ఆర్ఎస్ఈతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామని వివరించారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న చెరువులు, ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడుతుందని రంగనాథ్ స్పష్టం చేశారు. 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. హైడ్రా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు.
ఎఫ్టీఎల్కు సంబంధించి పారదర్శకంగా, శాస్త్రీయంగా మార్కింగ్ చేస్తామని వెల్లడించారు. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్తో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. హైడ్రాకు ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. భూముల రక్షణతో పాటు సమర్థంగా వరద నివారణ చర్యలు చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఇప్పుడు కొత్తగా ప్లాట్లు, ప్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారని ఆనందించారు. అన్నింటినీ బాగా చెక్ చేసుకొని ఇళ్లు, ప్లాట్లు కొనుకుంటున్నారని చెప్పారు. ఇళ్ల విషయంలో గతంలో కట్టిన వాటి జోలికి హైడ్రా పోదని స్పష్టం చేశారు. అధికారికమైనా, అనధికారికమైనా గతంలో నిర్మించిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని మరోసారి స్పష్టంగా చెప్పారు. అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను మాత్రం ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.

More Stories
కాంగ్రెస్ లో అగ్గికి ఆజ్యం పోసిన డిసిసి అధ్యక్షుల నియామకం!
సిగాచీ పరిశ్రమ పేలుడు దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఓఎస్డీని విచారించిన సిట్