
మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సంతాపం ప్రకటించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ దేశంలో అత్యున్నత పదవిని స్వీకరించారని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హాసభలే ఓ సంతాప సందేశంలో కొనియాడారు.
మన్మోహన్ సింగ్ సహకారం, భారతదేశానికి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మకు మోక్షాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
“భారత మాజీ ప్రధానమంత్రి, దేశ సీనియర్ నాయకుడు డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ మరణంతో యావత్ దేశం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆయన కుటుంబానికి, లెక్కలేనన్ని మంది ప్రియమైనవారికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది” అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు.
“డాక్టర్ మన్మోహన్ సింగ్, నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, దేశంలో అత్యున్నత పదవిని అలంకరించారు. ప్రఖ్యాత ఆర్థిక వేత్త డాక్టర్ సింగ్ భారతదేశానికి చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. గౌరవించబడుతుంది. మరణించిన వారి ఆత్మకు సద్గతి ప్రసాదించాలని మేము సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాము” అంటూ వారు నివాళులు అర్పించారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు