
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవపట్టించే పోస్టులను గుర్తించిన పోలీసులు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
పోలీసు శాఖను అప్రతిష్ఠపాలు చేసే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై సామాజిక మాధ్యమాల్లో సమాచారంతో పాటు ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ రాకముందే సంథ్య థియేటర్లో తొక్కిసలాట జరిగినట్లు తప్పుడు వీడియోలను కొందరు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
ఘటనపై విచారణ చేసిన క్రమంలో తెలిసిన నిజాలను ఇప్పటికే వీడియో రూపంలో విడుదల చేసినట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్ట్‌లు పెడితే, దాని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఎవరి దగ్గరైన ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే తమకు అందించవచ్చని పోలీసులు కోరారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?