
బంగ్లా జైలు నుంచి మరో భారత్ వ్యతిరేక, భారత్ లో ఉగ్రవాదులకు మద్దతు అందించిన అబ్దుస్ సలాం పింటు విడుదల అయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా సన్నిహితుల్లో ఒకడిగా చెప్పుకునే అబ్దుస్ ను బాంగ్లాదేశ్ కోర్టు విడుదల చేసింది. గతంలో మంత్రిగా పనిచేసిన అతను పాక్ ఆక్రమిత కాశ్మీర్, బాంగ్లాదేశ్ లోకి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను పంపించడంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
17 ఏళ్ళ తర్వాత విడుదల కావడంపై అటు బంగ్లాదేశ్, ఇటు భారత్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోవైపు భారత్‌కు అత్యంత ప్రమాదకారి అయిన అబ్దుస్ సలాం పింటును జైలు నుంచి విడుదల చేసి తన ద్వంద్వ వైఖరిని చాటుకుంది.
భారత్‌పై దాడికి ఉగ్రవాదులకు అబ్దుస్ సాయం చేశాడు. ఖలీదా జియా ప్రభుత్వంలో పింటు బంగ్లాదేశ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఈ సందర్భంగా భారత్‌తోపాటు హసీనాపై ఎన్నో కుట్రలు పన్నాడు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయ్యాడు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం ద్వారా వారు జమ్మూకశ్మీర్ ద్వారా భారత్‌కు హాని చేయాలని కుట్ర పన్నారు.
2001 నుంచి 2006 వరకు ఖలీదా జియా బంగ్లాదేశ్‌ను పాలించారు. ఆ సమయంలో పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద గ్రూపులకు బంగ్లాదేశ్ నుంచి ఆర్థిక సాయం అందింది. ఫలితంగా భారత్‌పై దాడులకు ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత పింటుపై దర్యాప్తు మొదలైంది. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర మంత్రి అన్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడాయన విడుదలతో అందరిలోనూ మరో ఆందోళన మొదలైంది. ఆయన ఎక్కడ మంత్రి అవుతాడోనని ఆందోళన చెందుతున్నారు. అయితే, ఖలీదా జియాకు ఆయన అత్యంత సన్నిహితుడు కావడంతో మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి