హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను అంతమొందించింది తామేనని ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించాడు. తాజాగా ఆయనను చంపింది తామేనని ఇజ్రాయెల్ తొలిసారిగా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు.
హనియా 1963లో గాజా సిటీకి సమీపంలోని ఒక శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980లో హమాస్ గ్రూపులో చేరగా 1990లో తొలిసారిగా హనియా పేరు వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన హనియా 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించిన తర్వాత గ్రూపులో కీలక వ్యక్తిగా ఎదిగాడు.
2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్‌ను పాలించాడు. 2017లో హమాస్ చీఫ్‌గా ఎన్నికైన హనియాను అమెరికా ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో ఆయన గాజా స్ట్రిప్‌ను వీడిన ఆయన ఖతార్‌లో నివాసం ఏర్పర్చుకున్నారు.

More Stories
షేక్ హసీనాకు బంగ్లా కోర్టు ఉరిశిక్ష
అవినీతికి వ్యతిరేకంగా దద్దరిల్లిన ఫిలిప్పీన్స్ రాజధాని
యుద్ధ ఖైదీలను మార్చుకొనున్న ఉక్రెయిన్-రష్యా