ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6100 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రాధమికంగా సుముఖత వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన బీపీసీఎల్ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీపీసీఎల్ యాజమాన్యం నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నిఫ్టీ)కి తెలియజేస్తూ ఓ లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కోస్తా తీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ముందస్తు పనులు చేపట్టేందుకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు బీపీసీఎల్ సెక్రటరీ తెలిపారు. ప్రీ ప్రాజెక్టు కార్యక్రమాల్లో భాగంగా గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం అధ్యయనం చేయనున్నారు.
అలాగే శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట ప్రాంతం పేరు కూడా వినిపించింది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా తూర్పు కోస్తా తీరంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కోసం ప్రీ ప్రాజెక్టు యాక్టివిటీస్ చేపట్టేందుకు బీపీసీఎల్ బోర్డు అనుమతి ఇచ్చింది.

More Stories
నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్!
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
పండుగ తరహాలో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు