
ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంతోపాటు ఫార్మా, ఐటీ, ఫిన్టెక్, సెక్యూరిటీ. ఇంధనరం వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘ఇది అద్భుతమైన భేటీ. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాం. ఇరుదేశాల మధ్య సాధారణ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాం.’ అని మోదీ వెల్లడించారు.
ఆ తర్వాత కువైట్ యువరాజు షేక్ సబా అల్-ఖలీద్ అల్-సబాతోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం సహా కీలకరంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. భారత్కు చెందిన అగ్రశ్రేణి వ్యాపార భాగస్వాముల్లో కువైట్ ఒకటి కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరోలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్ డాలర్లకు చేరింది.
అంతకుముందు ప్రధాని మోదీ కువైట్ రాజప్రసాదం వద్ద అధికారిక స్వాగతంతోపాటు గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ మొదటిరోజు ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం భారతీయ కార్మికుల శిబిరాన్ని సందర్శించి, వారితో కొంచెం సేపు ముచ్చటించారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి.
విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) ప్రధాని మోదీ పర్యటన వివరాలను ‘ఎక్స్’లో పంచుకుంది. ‘చరిత్రాత్మక పర్యటనకు ప్రత్యేక స్వాగతం! వైభవోపేత స్వాగతం, గౌరవ వందనానికి కువైట్లో బయన్ ప్యాలెస్ వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. కువైట్ ప్రధాని గౌరవనీయ షేఖ్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ సాదరంగా ఆహ్వానించారు’ అని ఎంఇఎ తన ప్రకటనలో తెలిపింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు