దట్టమైన మంచులోనూ రైళ్లకు ‘కవచ్’

దట్టమైన మంచులోనూ రైళ్లకు ‘కవచ్’

రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (కవచ్)ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ చాలా సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పలుమార్లు వెల్లడించారు. 

తాజాగా కవచ్ పనితీరుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్టు చేశారు. కవచ్ వ్యవస్థ సాయంతో దట్టమైన పొగమంచులోనూ పట్టాలపై రైలు దూసుకెళ్తున్న వీడియో అది. ఇక లోకో పైలట్ బయటకు చూడకుండానే కవచ్ సాయంతో సిగ్నల్ సమాచారం తెలుసుకోవచ్చని కేంద్ర మంత్రి రాసుకొచ్చారు.  సాధారణంగా విపరీతమైన పొగమంచు ఉన్నప్పుడు లోకోపైలట్‌కు ఒక్కోసారి సిగ్నల్ కూడా కన్పించని పరిస్థితి నెలకొంటుంది.

సమయంలో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువ. ఇప్పుడు కవచ్‌తో ఆ సమస్య ఉండబోదని రైల్వే మంత్రి వివరించారు. వ్యవస్థ సాయంతో బయట ఏం సిగ్నల్ పడిందనేది క్యాబిన్ లోని మానిటర్ పైనే లోకోపైలట్ చూసుకోవచ్చు. రైల్వే ప్రమాదాల నిరోధక వ్యవస్థ ‘కవచ్‌’ లోకో పైలట్స్‌కు ఎంతో సహాయకారిగా నిలుస్తున్నది. రైలు వేగ నియంత్రణ, పర్యవేక్షణతోపాటు సిగ్నల్స్‌కు సంబంధించి సమస్త పనులూ ‘కవచ్‌’ చేపడుతుంది.

దట్టమైన పొగమంచు, అనూహ్యమైన వాతావరణ పరిస్థితుల్లోనూ రైల్వే ప్రయాణం సాఫీగా సాగేలా ‘లోకో పైలట్‌’కు సాయం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’లో శనివారం విడుదల చేశారు. దట్టమైన పొగమంచులో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న ఓ రైలులో..కవచ్‌ మానిటర్‌ ‘గ్రీన్‌ సిగ్నల్‌’ చూపటం అందులో కనిపించింది. 

సిగ్నలింగ్‌, రైలు వేగం నియంత్రణ, ప్రమాదాల్ని అడ్డుకోవటం, ‘లోకో పైలట్‌’ ప్రమేయం లేకుండా బ్రేక్స్‌ వేయటం..మొదలైన పనులను ‘కవచ్‌’ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.