
లోపభూయిష్టంగా ఉన్న ధరణితో సమాచారాన్ని దేశం దాటించారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతులను తమ భూములకు దూరం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తన మెదడును రంగరించి మాజీ సిఎం కెసిఆర్ ఒక అద్భుత చట్టాన్ని తీసుకొస్తున్నామని ఆనాడు సభలో చెప్పారని, ధరణి పోర్టల్ కెసిఆర్ సొంతంగా కనిపెట్టింది కాదని, 2010లోనే ఒడిశాలో ఈ -ధరణి పేరుతో ఐఎల్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి బాధ్యతలు అప్పగించిందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఒడిశా సర్కారే తప్పు చేసిందని కాగ్ సూచిందని పేర్కొంటూ భారతి రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్బంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ధరణిలో లోపాలున్నాయని కాగ్ కూడా తేల్చిందని పేర్కొన్నారు. అర్హత లేని కంపెనీకి ధరణిని అప్పగించారని 2014లోనే కా గ్ తప్పుబట్టిందని చెప్పారు. కాగ్ తప్పుబట్టిన ధరణిని కెసిఆర్ తెలంగాణకు ఎందుకు తీసుకొచ్చారని సిఎం రేవంత్ ప్రశ్నించారు.
సత్యం రామలింగరాజుతో సంబంధం ఉన్న వ్యక్తులకు ధరణి టెండర్లు దక్కాయని ఆయన ఆరోపించారు. క్రిమినల్ కేసులున్న కంపెనీకి ధరణి టెండర్లు అప్పగించారని ఆయన విమర్శించారు. యువరాజు కెటిఆర్‌కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు ఈ ధరణి టెండర్లు దక్కాయని తెలిపారు. ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాల్లో ధరణి ఉందని రేవంత్ ఆరోపించారు. ధరణి చట్టాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త చట్టం తీసుకొస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు.
అర్హులైన ప్రతి భూ యజమానులు హక్కులు కాపాడేందుకు ఈ కొత్త చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని, చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావలని భావించామని సిఎం రేవంత్ తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా కోటి 52 లక్షల ఎకరాల భూముల వివరాలను భద్రపరుస్తామని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రతి భూ యజమాని హక్కులను కాపాడుతామని స్పష్టం చేశారు.
More Stories
ముగ్గురు కాళేశ్వరం ఇంజినీర్ల రూ. 400 కోట్ల ఆస్తులు సీజ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాస్వర్డ్ చెప్పాల్సిందే!
బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఎన్నికల ఆంక్షల ఉల్లంఘన కేసు