
ప్రముఖ తెలుగు యూట్యూబర్, నటుడు, రచయిత ప్రసాద్ బెహరను లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై పోలీసులు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు తెలుస్తుంది. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.
షూటింగ్ సమయంలో తనను అందరి ముందు పలుమార్లు అసభ్య పదజాలంతో దూషించాడని, అలాగే ప్రైవేటు భాగాలను తాకాడని, చెప్పలేని పదాలతో అవమానించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో ప్రసాద్ పరిచయమయ్యాడని, షూట్‌లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించాడని నిలదీయగా క్షమాణలు చెప్పాడని బాధితురాలు పేర్కొన్నారు.
అనంతరం కొద్ది రోజుల తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్‌లో కలిసి పని చేశామని, ఆ సమయంలో అందరి ముందు మీద పడుతూ, ముట్టుకుంటూ వేధించాడని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని, ఈ నెల 11న షూట్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనను కొట్టాడని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆమె బెహరా ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రసాద్ బెహరా తర్వాత రచయితగా నటుడిగా రాణిస్తున్నారు.
కమిటీ కుర్రాళ్లు సినిమాలో పెద్దోడు పాత్రతో ఆకట్టుకున్న ప్రసాద్ బెహరా…ప్రస్తుతం అల్లరి నరేష్ బచ్చల మల్లి సినిమాలో నటించారు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన ప్రసాద్ బెహరా.. కామెడీ సిరీస్ లు చేస్తూ యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న ప్రసాద్ బెహరాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది
మరోవంక, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ చేసిన యూట్యూబర్ భానుచందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన భానుచందర్ ఔటర్ రింగురోడ్డుపై చెట్ల పొదల్లో డబ్బులు వెదజల్లుతూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియో తీశారు. మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో వీడియోలు తీసి వైరల్ చేశాడు. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి