
ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలంటూ ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2023, ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది.
అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారినికి సంబంధించి దాదాపు రూ.55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. రూ.55 కోట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగాయని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు సర్కార్ ఆదేశించింది.
ఆర్థికశాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్‌లో లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకండా ఏ విధంగా అప్పగించారని దానిపై స్పష్టత లేకుండాపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వగా.. రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఇందులో ఏ1గా అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి మొదటగా ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి అనంతరం విచారణ జరుపనున్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి