నిజామాబాద్ కు రూ.100 కోట్లు విడుదల చేయాలి

నిజామాబాద్ కు రూ.100 కోట్లు విడుదల చేయాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పక్షపాత ధోరణి వహించకుండా అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి వెంటనే రూ.100 కోట్ల నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు.

ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అవుతున్నా నియోజకవర్గల అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కేటాయించక పోవడం సిగ్గుచెటని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ నియోజకవర్గం కొడంగల్ కు రూ.4వేల కోట్లు, కొందరి మంత్రుల నియోజకవర్గలకు వందల కోట్లు పోతుంటే ఇందూర్ అర్బన్ నియోజకవర్గనికి ఒక్క రూపాయి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బిజెపి ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎందుకు ఇంత పక్షపాత వైఖరి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతఃకరణ శుద్ధితో పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి బిజెపి ఎమ్మెల్యేల నియోజకవర్గలపై ఎందుకు పక్షపాతం చూపెడుతున్నారో సమాధానం చెప్పాలని కోరారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతఃకరణశుద్ధి ఉంటే ఇందూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్ల స్పెషల్ ఫండ్ నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.