
మహారాష్ట్రలో గత ఆదివారం కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 39 మంది మంత్రుల పదవీకాలం రెండున్నరేళ్లేనా? ఆ తర్వాత మంత్రుల పనితీరును బట్టి కొందరిని తొలగించే అవకాశం ఉందా? ఈ విషయమై అవుననే మహాయతి కూటమిలోని మూడు పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. శివనేత అధినేత ఎకనాథ్ షిండే అయితే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని ముందే హామీ పత్రాలపై తమ పార్టీకి చెందిన మంత్రులతో సంతకాలు చేయించుకున్నట్లు చెబుతున్నారు.
మంత్రివర్గం ఏర్పాటులో 12 మంది ప్రస్తుత మంత్రులకు అవకాశం ఇవ్వలేదు. 16 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అవకాశం దక్కని వారిలో నాలుగు నుండి ఆరు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైనా సీనియర్లు కూడా ఉన్నారు. ఓ మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు వంటివారున్నారు. దానితో మూడు పార్టీలలో కొంతమేర అసంతృప్తి సహజంగానే వ్యక్తం అవుతున్నది.
అందుకనే మంత్రుల పనితీరును బట్టి తర్వాత కొంతమందిని తొలగించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. మంత్రుల పనితీరును అంచనా వేసి, అందుకు రెండున్నరేళ్లు సమయం అవసరమని సరిగ్గా పనిచేయని వారిని మంత్రివర్గం నుండి తొలగిస్తామని ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ లు కూడా చెప్పిన్నట్లు చెబుతున్నారు.
“మంత్రుల పనితీరు ఆడిట్ జరుగుతుంది. మేము ముగ్గురం దీనికి అంగీకరించాము” అని సీఎం ఫడ్నవీస్ ఆదివారం చెప్పారు. శివసేన మంత్రి శంబురాజ్ దేశాయ్ మాట్లాడుతూ, ఉపముఖ్యమంత్రి కోరుకుంటే వాటిని అధికారికంగా తొలగించవచ్చని చెప్పారు. కొత్తగా ఎన్నికైన సేన శాసనసభ్యుడు నరేంద్ర భోండేకర్ తనకు క్యాబినెట్ పదవి నిరాకరించబడటం పట్ల అసంతృప్తితో పార్టీ పదవికి రాజీనామా చేశారు. బిజెపిలోని అసంతృప్తి నాయకులను పార్టీ పదవులకు పరిశీలిస్తామని ఫడ్నవీస్ చెప్పారు.
ఎన్‌సిపి (అజిత్ పవార్ వర్గం)లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రపుల్ పటేల్ లపై ఆ పార్టీ సీనియర్ నేత, సమతా పరిషద్ వ్యవస్థాపకులు చగన్ భుజ్ బల్ మంత్రిపదవి దక్కక పోవడంతో మంగళవారం నిప్పులు చెరిగారు. ‘ ‘నేనేమైనా వారి చేతుల్లో కీలు బొమ్మనా’ అంటూ మండిపడ్డారు. ఆయన శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు గైరాజర్ అయ్యేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం