స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 6 వికెట్లతో అరుదైన రికార్డు

స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 6 వికెట్లతో అరుదైన రికార్డు

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 6 వికెట్లు తీశాడు. దీంతో బుమ్రా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే రికార్డును బ్రేక్‌ చేశాడు.

బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 50 టెస్టు వికెట్లు వికెట్లు పడగొట్టగా, కుంబ్లే 49 వికెట్లు సాధించాడు. ఇక ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌(51) అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా మరో రెండు వికెట్లు పడగొడితే కపిల్‌ ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేస్తాడు. అలాగే టెస్టుల్లో 20 కంటే తక్కువ సగటుతో 190 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా వరల్డ్‌ రికార్డు సష్టించాడు. బుమ్రా 19.82 సగటుతో 190 వికెట్లను పడగొట్టాడు.

కాగా, మూడ‌వ టెస్టులో  మూడ‌వ రోజు ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో తొలుత 445కు ఆలౌటైన ఆస్ట్రేలియా ఆ త‌ర్వాత ఇండియ‌న్ టాప్ ఆర్డ‌ర్‌ను ఇబ్బందిపెట్టింది. వ‌ర్షం వ‌ల్ల ఆట నిలిచిపోయే స‌మ‌యానికి ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 51 ర‌న్స్ చేసింది. ఆసీస్ పేస్ అటాక్ ముందు భార‌త బ్యాట‌ర్లు చేతులెల్తేశారు. జైస్వాల్ 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 ర‌న్స్ చేశారు.

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా  ఉద‌యం 40 ర‌న్స్ జోడించి 445 ర‌న్స్‌కు ఆల్ అవుట్ అయ్యింది.  ఆసీస్ బ్యాట‌ర్ అలెక్స్ క్యారీ 88 బంతుల్లో 70 ర‌న్స్ చేశాడు. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌ సెంచ‌రీలు చేశారు. రెండో సెష‌న్‌లో వ‌ర్షం రావ‌డంతో ఆట నిలిచిపోయింది. మ‌ళ్లీ ట్రీ బ్రేక్ త‌ర్వాత కేవ‌లం 17 బంతులే ఆడిన త‌ర్వాత వ‌ర్షం వ‌చ్చింది. లైట్ కూడా డిమ్‌గా ఉండ‌డంతో ఆట‌ను ర‌ద్దు చేశారు.

భార‌త బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ ఒక్క‌డే స్థిరంగా ఆడాడు. ఆస్ట్రేలియా పేస్ అటాక్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. మిగితా టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు ఎవ‌రూ క్రీజ్‌లో నిల‌దొక్కుకోలేక‌పోయారు. మిచెల్ స్టార్క్‌, జోష్ హేజిల్‌వుడ్ వేగం ముందు భార‌త బ్యాట‌ర్లు తేలిపోయారు. మేటి బ్యాట‌ర్ కోహ్లీ కూడా ఈజీగా చిక్కేశాడు. భార‌త్ ఇంకా 394 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉన్న‌ది.