
ఉత్తరప్రదేశ్ సంభాల్‌లోని పురాతన శివాలయం వద్ద ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో కనిపించారు. కొన్ని రోజుల క్రితం జరిగిన హింసాకాండ తర్వాత నగరంలో జరిగిన ఆక్రమణల నివారణ చర్యలో ఈ ఆలయంను కనుగొన్నారు. ఆదివారం ఉదయం, ఆలయం గంటలు, శ్లోకాలతో ప్రతిధ్వనిస్తోంది. ఈ విషయమై పాలనా యంత్రాంగం చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.
ఈ ఆలయం సంభాల్ జిల్లాలోని నఖాసా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మొహల్లా ఖగ్గు సారాయ్ ప్రాంతంలో ఉంది. 1978 నుండి మూసి ఉన్న ఆలయాన్ని సంభాల్ పాలనా యంత్రాంగం శుక్రవారం తిరిగి తెరిచింది. స్థానికులు, పోలీసులు, అధికారులు భస్మ శంకర్ ఆలయంలో ఉంచిన శివుడు, హనుమంతుడి విగ్రహాలను పూజించడం ప్రారంభించారు.
పూజారులు ఆలయంలో ఆదివారం రుద్రాభిషేకం కూడా నిర్వహించారు. 46 సంవత్సరాల క్రితం అల్లర్లకు పాల్పడి, హిందూ జనాభా జిల్లా నుండి వలస వెళ్ళేలా చేసిన వారిపై గత ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. హనుమంతుడి విగ్రహం రాత్రికి రాత్రే బయటపడిందా? అని ఆయన అడిగారు.
స్థానికుల ప్రకారం, స్థానిక హిందూ సమాజం స్థానభ్రంశం చెందడానికి దారితీసిన మతపరమైన అల్లర్ల తర్వాత 1978 నుండి ఆలయం తాళం వేసి ఉంది. ఈ ప్రాంతంలో విద్యుత్ చౌర్యానికి వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ వందన మిశ్రా మాట్లాడుతూ, “ఈ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు, మేము అనుకోకుండా ఈ ఆలయాన్ని చూశాము. దానిని గమనించిన వెంటనే నేను జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చాను. మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఆలయాన్ని తిరిగి తెరవాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.
ఆలయం చుట్టూ నిర్మించిన ఆక్రమణ గోడను తొలగించారు. పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత, ఆలయం స్పష్టంగా కనిపిస్తుంది. అదనపు ఎస్పీ శ్రీష్ చంద్ర మాట్లాడుతూ, “తనిఖీ చేస్తున్నప్పుడు కొంతమంది ఇళ్ళు నిర్మించి ఆలయాన్ని ఆక్రమించినట్లు తేలింది. ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆలయాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాము. ఆలయంలో శివుడు, హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో హిందూ కుటుంబాలు నివసించేవి. కొన్ని కారణాల వల్ల, వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు… ఆలయానికి సమీపంలో ఉన్న పురాతన బావి గురించి కూడా సమాచారం ఉంది…” అని వివరించారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలో సీసీటీవీలను ఏర్పాటు చేయడానికి కూడా పాలనాయంత్రంగం కృషి చేస్తోంది. సంభాల్ సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ, “ఈ ప్రాంతంలోని ఒక ఆలయం ఆక్రమణకు గురవుతున్నట్లు మాకు సమాచారం అందింది. మేము ఆ ప్రదేశాన్ని పరిశీలించినప్పుడు, అక్కడ ఒక ఆలయం కనిపించింది” అని చెప్పారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం