
మొన్నటికి మొన్న వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆహారం వికటించి తొమ్మిదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తే.. కాంగ్రెస్ మంత్రులేమో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర దాగి ఉందంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కుమార్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో హాస్టళ్లు, గురుకులాల్లో అనేకమంది అభశుభం తెలియని విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం, అనారోగ్యంపాలవ్వడం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గురుకులాల్లో తప్పిదాలను సరిదిద్దుకోకుండా చోద్యం చూస్తున్నదని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ వైఖరితో మాసబ్ ట్యాంక్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ లో నిధుల్లేకుండా వెలవెలబోతున్నదని విమర్శించారు.
తెలంగాణలో చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చినా అవేమీ అమలు కావడం లేదని స్పష్టం చేశారు. బడ్జెట్ లోనూ ప్రస్తావించిన నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని చెబుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులను దారిమళ్లిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులు అధ్యయనం చేసేందుకు తనిఖీల పేరుతో తూతూమంత్రంగా రాష్ట్ర మంత్రులు మూకుమ్మడిగా బయల్దేదారని ఎద్దేవా చేశారు.
విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ల సంఖ్యను పెంచుతామంటూ హామీలు గుప్పించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని అంటూ టార్గెట్లేమో వందలు.. అమలు మాత్రం పదుల సంఖ్యలోనా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే నిరుపేద విద్యార్థులకు రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దరఖాస్తుల స్వీకరిస్తున్నా లబ్ధిదారులను ఎంపిక చేయడం లేదని ధ్వజమెత్తారు.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే