ఓపెన్ ఎఐ వేగు సుచిర్ బాలాజీ హత్య?

ఓపెన్ ఎఐ వేగు సుచిర్ బాలాజీ హత్య?
భార‌త సంత‌తికి చెందిన ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలో 26 ఏళ్ల ఆ వ్య‌క్తి అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించాడు. న‌గంర‌లోని బుచాన‌న్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లో సుచిన్ బాలాజీ మృత‌దేహాన్ని గుర్తించారు. అత‌ను సూసైడ్ చేసుకున్న‌ట్లు మెడిక‌ల్ ఆఫీస‌ర్ తెలిపారు. మ‌ర‌ణం వెనుక ఎటువంటి ఆధారాలు లేవ‌ని పోలీసులు చెప్పారు. 
 
నవంబర్ 26న అతడు చనిపోగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓపెన్ ఎఐతో చేస్తున్న ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు మంచివి కావని సుచిర్ తన రీసెర్చ్ ద్వారా హెచ్చరించారు.  ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో పేరుగాంచిన ఓపెన్ఏఐ సంస్థ‌లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను సుచిర్ బాలాజీ వెలుగులోకి తెచ్చాడు. ఆ కంపెనీ అనుస‌రిస్తున్న వ్యాపార విధానంపై ఇప్ప‌టికే ప‌లు దావాలు దాఖ‌లు అయ్యాయి.
 
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన సంస్థ ఓపెన్ఏఐ. 2020లో ఇంటర్న్‌షిప్ చేయడానికి ఇందులో చేరారు. అందులో రీసెర్చర్‌గా కొనసాగారు. ఈ ఏడాది అక్టోబర్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాపీ రైట్ విషయంలో మూడు నెలలుగా ఓపెన్ ఏఐపై న్యాయపోరాటం చేస్తూ వస్తోన్నాడు.  చాట్ జీపీటీకి శిక్షణ ఇవ్వడానికి ఆయన డెవలప్‌మెంట్‌ చేసిన టెక్నాలజీకి సంబంధించిన కాపీరైట్ ఇది. తాను అభివృద్ధి చేసిన ఛాట్ జీపీటీ ఏఐ మోడల్‌‌ను ఓపెన్ ఏఐ వినియోగిస్తోందనేది ఆయన ప్రధాన ఆరోపణ. కాపీరైట్ చట్టాన్ని ఆ కంపెనీ ఉల్లంఘించిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మొట్ట మొదటిసారిగా నవంబర్‌ రెండో వారంలో బహిరంగంగా ఓపెన్ ఏఐపై ఆరోపణలు చేశారు సుచిర్ బాలాజీ. యూఎస్ మీడియాతో మాట్లాడారు. ఛాట్‌ జీపీటీకి శిక్షణ ఇవ్వడానికి వినియోగించిన టెక్నాలజీ ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు.  తాను డెవలప్ చేసిన ప్రోగ్రామ్‌‌ను కాపీరైట్ కంటెంట్‌కు విరుద్ధంగా ఆ సంస్థ ఉపయోగించిందని ఆరోపించారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే అంటే నవంబర్ 26వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కో బుకానన్ స్ట్రీట్‌లో గల అపార్ట్‌మెంట్‌లో మృతదేహమై కనిపించారు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌కు చెందిన చాట్‌జీపీటీ టెక్నాల‌జీ ద్వారా ప్ర‌స్తుతం ల‌క్ష‌లాది మంది డ‌బ్బులు ఆర్జిస్తున్నారు. ఓపెన్ఏఐ సంస్థ వ్యాపార‌వేత్త‌ల‌ను, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను వేధిస్తున్న‌ట్లు బాలాజీ ఆరోపించారు. స‌మాజానికి హాని చేసే సంస్థ‌లో ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఓపెన్ఏఐ సంస్థ‌ను బాలాజీ వ‌దిలివెళ్లాడు.