ఉత్తర సిరియాపై హయాత్ తహరీర్ అల్-షామ్ (హెచ్ టి ఎస్) నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు పట్టుబిగిస్తుంటే, దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్ వ్యతిరేకంగా మారింది. కీలక నగరమైన దారాతోపాటు స్వీడియా తదితర ప్రాంతాల నుంచి సిరియా సైన్యాలు శనివారం వైదొలగడం వల్ల అవి తిరుగుబాటుదారుల వశమయ్యాయి.
ఇక, డమాస్కస్ శివారు ప్రాంతాలైన మదామియా, జరామానా, దరాయల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. 2011లో దారా నగరం నుంచి అసద్‌కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత అది అంతర్యుద్ధంగా మారింది. దారాలోని 90శాతం భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
దారాకు 50 కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయాయి. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన మైనారిటీ డ్రూజ్ తెగ మిలిటెంట్లు డమాస్కస్ దిశగా సాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమిస్తారనే భయంతో డమాస్కస్‌లోని వేలాది మంది పౌరులు లెబనాన్ సరిహద్దులకు చేరుకుంటున్నారు.

More Stories
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
సరిహద్దులో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!