
* ‘మానస’లో అంతర్జాతీయ దివ్యాంగజనుల దినోత్సవం
జాతీయ న్యాయ సేవల సంస్థ నిర్దేశాల మేరకు, రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో ఉన్న జిల్లా న్యాయ సేవల సంస్థలో మానసిక రోగులకు, మానసిక దివ్యాంగుల సేవల కొరకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పరుస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. శ్రీదేవి ప్రకటించారు.
అంతర్జాతీయ దివ్యాంగజనుల దినోత్సవం సందర్భంగా “దివ్యాంగులకు సుస్థిర భవిష్యత్తుపై భరోసా” అనే అంశంపై ‘మానస చిన్నారుల ఆరోగ్య వైకల్యాలు అధ్యయన సంస్థ’, ‘రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ’ల సంయుక్త అధ్వర్యంలో కొత్తపేట మనసులో మంగళవారం జరిగిన సెమినార్ లో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
హక్కుల సంరక్షణ కొరకు, ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాల సౌలభ్యం అందకపోవటం, దివ్యంగజనులుగా ఉన్న కారణంగా విద్య సంస్థలలో ప్రవేశం లభించకపోవటం వంటి సమస్యలు ఉన్నవారు న్యాయ సేవల కొరకు తమను సంప్రదించవచ్చని జిల్లా న్యాయ సేవల సంస్థ సెక్రటరీ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీదేవి దివ్యంగజనుల తల్లిదండ్రులకు సూచించారు.
నిజాయతీగా అమాయకత్వంతో ఉండే దివ్యంగాజనుల హక్కులను సంరక్షించటలో సమాజంలోని అందరూ చేయుత అందించాలని ఆమె చెప్పారు. దివ్యాంగజనుల అవసరమైన న్యాయ సేవలను అందించటంలో న్యాయ సేవల సంస్థకు సార్ధకత చేకూరుతుందని తాను భావిస్తున్నట్లు న్యాయమూర్తి పి.శ్రీదేవి పేర్కొన్నారు.
జిల్లా పిల్లల సంక్షేమ కమిటీ చైర్మన్ గా పనిచేసిన పి శ్యామలా దేవి మాట్లాడుతూ కొద్దిమంది తల్లిదండ్రులు భారం మోయలేమని భావించి దివ్యంగాజనులైన తమ సొంత పిల్లలను వదిలివేయడం గమనించి చాల బాధ పడ్డట్లుగా చెప్పారు. మానసిక దివ్యంగాజనులకు వసతి సౌకర్యంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పరచటం చాల అవసరమని ఆమె తెలిపారు. మానసిక దివ్యంగాజనులు మిగతా దివ్యంగాజనులతో పోల్చినపుడు ప్రత్యేకమైన వారని, షరతులు లేని ప్రేమను వారికి అందించాలని ఆమె కోరారు.
ఆహార భద్రత ప్రమాణాల జాతీయ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ బాలునాయక్ కేతావత్ మాట్లాడుతూ స్థానికంగా దొరికే వాటిని, ప్రకృతి పరంగా సహజంగా కాలానుగుణంగా లభ్యమయ్యే కాయగూరలను పళ్ళను తప్పనిసరిగా భుజించే ఆహారంలో భాగంగా చేసుకోవటం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటంలో ఎంతో తోడ్పాటుతుందని చెప్పారు. దివ్యంగాజనుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే సాంకేతిక పరికరాలు రూపొందించి అవసరమైతే వాటిపై పేటెంటు రిజిస్టర్ చేసుకొనేందుకు సేవా తత్పరత కలిగిన స్వచ్చంద సంస్థలు ప్రయత్నించాలని ఆయన కోరారు.
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఉప్పల్, మల్లాపూర్ తదితర పారిశ్రామిక ప్రాంతాలకు కమిషనర్ గా ఉన్న అత్తి ప్రభాకర్ మానసిక దివ్యాంగ చిన్నారులకు ఉచిత ప్రత్యేక పాఠశాల, స్పీచ్ థెరపీ, ఫీజియోథెరపీ, బిహేవియర్ థెరపీ తదితర వైద్య సేవలు అందిస్తున్న ‘మానస’ కు తనవంతు విరాళంగా ఓ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మానస ప్రత్యేక పాఠశాలలోని దివ్యంగజన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఆటల పోటీలలో నిగ్గిన దివ్యంగజన చిన్నారులకు అతిధులు బహుమతులు అందించారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు