ఎగువ డచిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గందేర్బల్లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించాడని, అతనని లష్కరే తొయిబా కేటగిరి-ఎ తీవ్రవాద జునైద్ అహ్మద్ భట్‌గా గుర్తించామని చెప్పారు.
గంగాఘీర్, గందెర్బల్లో సాధారణ ప్రజానీకాన్ని పొట్టనపెట్టుకున్న ఘటనల్లో ఇతని ప్రమేయం ఉందని తెలిపారు. ఎన్కౌంటర్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. కాగా, గందేర్బల్ ఉగ్రదాడి సమయంలో జునైద్ అహ్మద్ భట్ ఏకే సిరీస్ తుపాకీతో తిరుగుతున్నట్టు సీసీటీవీలో నమోదైంది. ఇటీవలే ఆ ఫుటేజ్ బయటకు రావడంతో అప్పట్నించి అతని కదలికలపై పోలీసులు, నిఘా విభాగాలు కన్నేసి ఉంచారు.

More Stories
ఢిల్లీలో పాకిస్థాన్ లింక్డ్ గూఢచర్య ముఠా గుట్టురట్టు
ఒడిశాలో 11 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది నక్సల్స్ లొంగుబాటు
మిస్సింగ్ కేసులు పెరగటంపై ఎన్హెచ్ఆర్సి ఆందోళన