
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందూ ఆలయాలపై కొద్దికాలంగా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా అక్కడ భారత దేశ జెండాను తొక్కుతూ అవమానించారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జేఎన్ రే ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ చెందిన రోగులకు చికిత్స చేయబోమని ప్రకటించింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత దేశ జెండాను తొక్కుతూ అవమానించారని అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. `ఈరోజు నుంచి నిరవధిక సమయం వరకు బంగ్లాదేశ్ రోగులను చికిత్స కోసం చేర్చుకోబోమని మేం నోటిఫికేషన్ జారీ చేశాం. భారతదేశం పట్ల వారు చూపిన అవమానాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ప్రకటించారు. ఆ విధంగా పశ్చిమ బెంగాల్ లోని పలువురు వైద్యులు తాము బంగ్లాదేశ్ రోగులకు చికిత్స అందజేయమని స్పష్టం చేస్తున్నారు.
కాగా, సిలిగురిలోని ఓ హాస్పిటల్ వద్ద ఓ బోర్డు పెట్టారు. తమ ఆసుపత్రిలోకి వచ్చే రోగులు అందరూ ముందుగా భారత దేశ పతాకంకు వందనం చేయాలని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లో భారత్ పతాకంలను అవమానిస్తున్నందుకు నిరసనగా ఆ విధంగా చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉత్తర బెంగాల్ లో ఉన్న సిలిగురి బంగ్లాదేశ్ నుండి చాలామంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు.
సీనియర్ ఇ ఎన్ టి వైద్యులు డా. శేఖర్ బందోపాధ్యాయ జాతీయ పతాకంను మాతృమూర్తిగా భావిస్తూ ఉంటామని, పొరుగు దేశంలో అవమానపరుస్తుంటే సహించలేక పోతున్నానని చెప్పారు. ఓ వైద్యునిగా రోగులకు చికిత్స నిరాకరించలేనని, అందుకనే భారత జాతీయ పతాకంకు వందనం చేసి ఆసుపత్రిలో ప్రవేశింపమని ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చే వారిని కోరుతున్నానని ఆయన చెప్పారు.
మరోవైపు కోల్‌కతాలోని తమ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వెలుపల నిరసనలు వ్యక్తం కావడంపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పించాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్