కాప్‌ -29 ఒప్పందం పట్ల భారత్ అభ్యంతరం

కాప్‌ -29  ఒప్పందం పట్ల భారత్ అభ్యంతరం

కాప్‌ -29 ఫైనాన్స్‌ ఒప్పందాన్ని సదస్సు ఆమోదించిన తరువాత భారత్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాతావరణ మార్పుకు సంబంధించిన ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ ఒప్పందానికి రావడాన్ని  ‘ఆప్టికల్‌ ఇల్యూషన్‌’గా పేర్కొంది.  ఇది చాలా తక్కువ, చాలా ఆలస్యం అని పెదవి విరిచింది.

క్లైమేట్‌ ఫైనాన్స్‌ ఫండ్‌ కింద ఏటా లక్షా 30 వేల కోట్ల డాలర్లు చెల్లించాలని వర్ధమాన దేశాలు గొంతు చించుకుంటుంటే 30 వేల డాలర్లతో సంపన్న దేశాలు సరిపెట్టాయని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని కాప్‌-29 సదస్పులో పాల్గొన్న భారత ప్రతినిధి బృందం నాయకురాలు చాందిని రైనా సదస్సు ముంగింపు ప్లీనరీలో మాట్లాడుతూ చెప్పారు. 

భారత్‌ వైఖరిని నైజీరియా సమర్థిస్తూ, ఈ ఫైడాన్స్‌ డీల్‌ ఓ జోక్‌ అని వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడం ద్వారా మొత్తం గ్లోబల్ సౌత్ ఆందోళనలను ముందుకు తీవడంలో భారత్ నాయకత్వం వహించినట్లయింది. “అభివృద్ధి చెందిన దేశ పార్టీలు తమ బాధ్యతలను నిర్వర్తించడానికి ఇష్టపడకపోవడాన్ని స్పష్టంగా తెలియజేసే ఫలితంపై మేము నిరాశ చెందాము” అని ఆమె చెప్పారు. 

”ఈ పత్రం ఆప్టికల్‌ భ్రమ తప్ప మరేమీ కాదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఇది మా అభిప్రాయం ప్రకారం, మనమందరం ఎదుర్కొంటున్న సవాలు తీవ్రతను పరిష్కరించదు. అందువల్ల, ఈ పత్రాన్ని ఆమోదించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ”అని భారత ప్రతినిధి స్పష్టం చేశారు.  డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అడ్వైజర్ రైనా, సమ్మిట్ ముగింపు ప్లీనరీ సెషన్‌లో ప్రసంగిస్తూ, ఒప్పందాన్ని ఆమోదించే ముందు ప్రతినిధి బృందాన్ని మాట్లాడటానికి అనుమతించలేదని విచారం వ్యక్తం చేశారు.

$300 బిలియన్లు అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలు,  ప్రాధాన్యతలను పరిష్కరించవని ఆమె స్పష్టం చేశారు. ఇది వాతావరణ మార్పుల ప్రభావంపై యుద్ధంతో సంబంధం లేకుండా సిబిడిఆర్ (కామన్ కానీ డిఫరెన్సియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్), సమానత్వం సూత్రానికి విరుద్ధంగా ఉంది” అని రైనా తెలిపారు. “మేము చాలా అసంతృప్తిగా ఉన్నాము, ఈ ప్రక్రియతో నిరాశ చెందాము, ఈ ఎజెండాను ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నాము,” అని ఆమె తేల్చి చెప్పారు.