
ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చకు రానుంది. లోక్‌సభ సచివాలయం బుధవారం విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024ను ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు.
శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించారు. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29 లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చించి మోదించనున్నారు.
మరోవైపు, నివేదికకు తుది మెరుగులు దిద్దనుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ). అందులో భాగంగా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ గురువారం భేటీ కానుంది. వక్ఫ్ బిల్లుపై నివేదికను ఫైనల్ చేయనుంది. ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపింది. అయితే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే కొత్త బిల్లుల జాబితాలో ఇది లేకపోయినప్పటికీ ఈ సమావేశంలోనే దీనిని కూడా ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
More Stories
ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నిస్ కన్నుమూత
ఏఐతో డీప్‌ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా
లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా అస్సాంలో నూతన బిల్లు